
ప్రతి మదిలో ఉప్పొంగిన దేశభక్తి
బనశంకరి: స్వాతంత్య్ర దిన వేడుకలు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. వాడవాడలా జాతీయ జెండాలు రెపరెపలాడాయి. జాతి నేతల త్యాగాలను స్మరిస్తూ నేతల ప్రసంగాలు ప్రజల్లో ఉత్తేజాన్ని నింపాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, మహనీయుల వేషధారణలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. బెంగళూరులోని మానెక్‌షా పరేడ్ మైదానంలో కర్ణాటక పోలీస్ బ్రాండ్ కళాకారుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హరొహళ్లి పాలికె పీయూ కళాశాలకు చెందిన విద్యార్థులు స్వాతంత్య్ర ఘట్టానికి సంబంధించిన వీర కన్నడతి పేరుతో నృత్య రూపకం ప్రదర్శించారు. ఐదు గ్యారంటీ పథకాలకు సంబంధించి విద్యార్థులతో ప్రదర్శనలు ఇప్పించారు. రాజేశ్, నిర్మల డీఆర్‌బృందం నాడగీతం, రైతుగీతం, డొళ్లుకుణిత తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కలబుర్గి, ధార్వాడ, మైసూరు తదితర నగరాల్లో స్వాతంత్య్ర దిన వేడుకల సంబరాలు మిన్నంటాయి.

ప్రతి మదిలో ఉప్పొంగిన దేశభక్తి

ప్రతి మదిలో ఉప్పొంగిన దేశభక్తి