పేదలకు భూములు పంచండి
రాయచూరు రూరల్: జిల్లాలో భూమి లేని పేదలకు భూములు పంచాలని భూ వసతి పోరాట సమితి డిమాండ్ చేసింది. శుక్రవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సమితి అధ్యక్షుడు ఆంజనేయ మాట్లాడారు. పేదలు సాగు చేసుకుంటున్న భూములకు నిజమైన లబ్ధిదారులను గుర్తించి వారికి భూములు పంపిణీ చేయాలని ఒత్తిడి చేశారు. అనంతరం స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.
కేంద్రీయ పాఠశాలలో విద్యార్థులకు శిబిరం
హొసపేటె: టీబీ డ్యాం పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయంలో శుక్రవారం విద్యార్థులకు శిక్షణా శిబిరాన్ని ప్రారంభించారు. 3 నుంచి 10వ తరగతి ఆంగ్ల మీడియం విద్యార్థులకు తెలుగు భాష గురించి అక్షరాలను ఉపాధ్యాయురాలు జీ.సునీత తెలియజేశారు. కేంద్రీయ విద్యాలయం ఈ సారి రీజినల్ లాంగ్వేజ్‌లో ఒకటైన తెలుగు అక్షరాలను చదవడం, రాయడంపై ఒక వారం పాటు విద్యార్థులకు ఈ శిబిరాన్ని చేపట్టామని ప్రిన్సిపల్ మనోహర్‌లాల్ తెలిపారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ ప్రకాష్, విద్యార్థులు పాల్గొన్నారు.
నిలిచిన లారీకి కారు ఢీ.. ముగ్గురి దుర్మరణం
హుబ్లీ: నిలబడిన లారీని కారు ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందిన ఘటన జిల్లాలోని అణ్ణిగేరి తాలూకా భద్రపుర వద్ద హైవేలో గురువారం చోటు చేసుకుంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న మదన్, సురేష్, ఎల్‌ఎన్.వేణుగోపాల్ మృతి చెందారు. తోట చూసుకొని ముండరగి నుంచి బెంగళూరు వైపునకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను మైసూరు, బెంగళూరుకు చెందిన వారుగా గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే అణ్ణిగేరి పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించండి
రాయచూరు రూరల్ : జిల్లాలో సంచార నియమాలను తప్పకుండా ప్రతి ఒక్క వాహనదారు పాటించాలని జిల్లా ఎస్పీ పుట్టమాదయ్య పేర్కొన్నారు. గురువారం తన కార్యాలయం వద్ద ప్రచారాందోళనకు శ్రీకారం చుట్టి ఆయన మాట్లాడారు. యువత, ప్రజలు ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు. అధిక శాతం మంది గ్రామీణ ప్రజలు సైబర్ నేరాలకు బలవుతూ లక్షల్లో డబ్బులు కోల్పోయారన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఏఎస్పీ హరీ్‌ష్, డీఎస్పీ శాంతవీర, సీఐలు ఉమేష్ నారాయణ కాంబ్లే, మహేష్, సాబయ్య పాల్గొన్నారు.
ఆకాశవాణి అధికారికి
ఘనంగా వీడ్కోలు
రాయచూరు రూరల్: రాయచూరు ఆకాశవాణిలో విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన అధికారి బావలత్తిని ఎద్దుల బండిలో ఊరేగించి ఘనంగా వీడ్కోలు పలికారు. గురువారం పదవీ విరమణ సందర్భంగా ఆయన మద్దతుదారులు, అభిమానులు ఆయనకు అభినందనలు తెలపడానికి భారీగా తరలివచ్చి నూతన ఒరవడితో వీడ్కోలు పలికారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ హనుమంతప్ప పాల్గొని మాట్లాడుతూ 30 ఏళ్ల పాటు విధులు నిర్వహించిన అధికారి బావలత్తి అందరి మనస్సులను దోచుకున్నారన్నారు. వెంకటేష్ బేవినబెంచి, సరోజ, విజయ రాజేంద్ర, బండేష్, ఈరణ్ణలున్నారు.
పేదలకు భూములు పంచండి
పేదలకు భూములు పంచండి
పేదలకు భూములు పంచండి
పేదలకు భూములు పంచండి


