కుటుంబ కలహాలతో భార్య హత్య
విజయపుర(బెంగళూరు గ్రామీణ): కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన భార్యను డంబల్స్‌తో కొట్టి హతమార్చి తాను కూడా ఉరి వేసుకొన్న సంఘటన విజయపుర పట్టణంలోని 5వ వార్డు మారుతి నగరలోని విజయనగర లేఔట్‌లోని 2వ క్రాస్‌లో చోటు చేసుకుంది. శిడ్లఘట్ట డీవియేషన్ రోడ్డులో నివాసం ఉన్న వెల్డింగ్ దుకాణం యజమాని బసవాచారి(46) అనే వ్యక్తి మంగళవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చి తన భార్య సుమా(38)ను డంబల్స్‌తో కొట్టి హత్య చేసిన ఆనంతరం తాను కూడా ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. హాసన జిల్లాకు చెందిన బసవాచారి విజయపురకు వచ్చి సుమారు 25 సంవత్సరాలుగా ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. కుమారులు 9వ తరగతి, 7వ తరగతి చదువుతున్నారు. విషయం తెలియగానే బెంగళూరు గ్రామీణ జిల్లా ఎస్పీ సీ.కే.బాబా పరిశీలించారు. విజయపుర టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆపై తనూ ఆత్మహత్య చేసుకున్న భర్త


