బోర్డు తిప్పేసిన మరో కంపెనీ
రాయచూరు రూరల్: నగరంలో ఏడాది క్రితం దర్వేశి కంపెనీ మోసం చేిసిన విషయం కనుమరుగు కాక ముందే మరో కంపెనీ ప్రజలకు కుచ్చుటోపీ పెట్టింది. ఈ ఘటనపై పశ్చిమ పోలీస్ స్టేషన్‌లో గురువారం కేసు నమోదైంది. నిజలింగప్ప కాలనీలో లర్నింగ్ అకాడమీ ట్రేడింగ్ పేరుతో ప్రజల నుంచి సొమ్ములు సేకరించిన కంపెనీ యజమానులు దుబైకి పారిపోయారు. అంద్రూన్ కిల్లా నివాసి 2024లో 14 శాతం వడ్డీ చెల్లిస్తామని చెప్పడంతో చాలా మంది డబ్బులు పెట్టుబడి పెట్టారు. గత మూడు నెలల నుంచి దుబైకి పారిపోయిన అకాడమీ భాగస్వాములు ఇబ్రహీం, నర్సి, అహ్మద్ గాజాలి, మహారాష్ట్ర అలీలు కలసి ప్రజలకు శఠగోపం పెట్టారు. ఇబ్రహీం సోదరుడు ఇస్మాయిల్ దుబై నుంచి తిరిగి రాగా ఈనెల 13న ఇంటికి వెెళ్లి డబ్బుల గురించి అడిగితే తనకు సంబంధం లేదని చెప్పడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్వేశి కంపెనీలానే మరొక కంపెనీ లర్నింగ్ అకాడమీ ట్రేడింగ్ పేరుతో ప్రజలను మోసం చేసిందని బాధితుడు దస్తగిరి వాపోయారు.
రూ.కోట్లాది మేర వంచన
నలుగురిపై కేసు నమోదు


