రాయచూరు రూరల్ : ఏఐడీవైఓ, ఏఐడీఎస్‌ఓ, ఏఐఎమ్‌ఎస్‌ఎస్‌ల ఆధ్వర్యంలో శనివారం భగత్‌సింగ్ ఆత్మార్పణ దినోత్సవాన్ని నిర్వహించారు. భగత సింగ్ సర్కిల్ వద్ద ఆయన చిత్రపటానికి నాయకులు నివాళులర్పించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో అసువులుబాసిన భగత్‌సింగ్ నడిచిన బాట అందరికీ ఆదర్శమన్నారు. భగత్‌సింగ్ ఆశయాలను, ఆదర్శాలను అలవర్చుకోవాలని కోరారు. అనంతరం విద్యార్థులకు చిత్ర లేఖనం పోటీలు నిర్వహించారు. సరోజ, చెన్న బసవ పాల్గొన్నారు.
బళ్లారిఅర్బన్: అమరులైన భగత్‌సింగ్, రాజ్‌గురు, సుకదేవ్ ఆశయాలను కొనసాగించాలని వక్తలు అన్నారు. బీమ్స్ మైదానం, మున్సిపల్ మైదానం, సొంత లింగన్నపార్క్‌తో పాటు వివిధ హాస్టల్, గ్రామాలలో ఆదివారం ఏర్పాటు చేసిన భగత్‌సింగ్ వర్ధంతి కార్యక్రమంలో ఏఐడీఎస్‌ఓ నేత సుభాష్ పాల్గొని మాట్లాడారు. భగత్‌సింగ్ స్ఫూర్తితో సామాజిక అసమానతలపై పోరాటం చేయాలన్నారు. ఏఐడీఎస్‌ఓ నేతలు కే.ఈరణ్ణ, ఎం.శాంతి.ఉమా, నిహారిక, అయిషా, శివు, కంబలి మంజునాథ్, తదితరులు పాల్గొన్నారు.
భగత్‌సింగ్ ఆశయ సాధనకు కృషి