గ్రంథాలయాలు జ్ఞాన భాండాగారాలు | - | Sakshi
Sakshi News home page

గ్రంథాలయాలు జ్ఞాన భాండాగారాలు

Mar 21 2025 1:39 AM | Updated on Mar 21 2025 1:33 AM

రాయచూరు రూరల్‌ : గ్రంథాలయాలు జ్ఞాన భాండాగారాల వంటివని కలబుర్గి కేంద్రీయ విశ్వ విద్యాలయం వైస్‌ చాన్సలర్‌ బట్టా సత్యనారాయణ ప్రారంభించారు. గురువారం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం, కలబుర్గి కేంద్రీయ విద్యాలయం, న్యూఢిల్లీ భారతీయ గ్రంథాలయ సంఘం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరుగనున్న 70వ అంతర్జాతీయ గ్రంథాలయ వార్షికోత్సవాలను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. గ్రంథాలయాల ద్వారా జ్ఞాన సముపార్జనకు అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ హన్మంతప్ప, ఇమాం షా పతక్‌, శ్రీనివాస్‌ రావ్‌, అజయ్‌ ప్రతాప్‌ సింగ్‌, సుయమీంద్ర కులకర్ణి, మోహన్‌, చౌబే, సిద్ద మల్లయ్య, సురేష్‌ జంగ్‌, సభ్యులు బసన గౌడ, మల్లేష్‌, కట్టిమని, మచేంద్రనాథ్‌, విదేశీ ప్రతినిధులు ప్రత్యేక అతిథులుగా, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన గ్రంథాలయాల అధికారులు, సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement