కర్ణాటక శాసనసభ్యులు..
బనశంకరి: దేశంలోనే శ్రీమంత ఎమ్మెల్యేల జాబితాను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ (ఏడీఆర్) విడుదలచేసింది. టాప్ 10 ఎమ్మెల్యేలలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ ద్వితీయ స్థానంలో ఉన్నారు. 28 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 4,092 మంది ఎమ్మెల్యేలు ఆస్తులను అధ్యయనం చేసి ఏడీఆర్ నివేదిక విడుదలచేసింది.
కళ్లుచెదిరే ఆస్తులు
● ధనిక ఎమ్మెల్యేలలో కర్ణాటక మొదటి స్థానంలో ఉండడం గమనార్హం. రాష్ట్రంలో 223 ఎమ్మెల్యేలు మొత్తం ఆస్తుల విలువ రూ.14,179 కోట్లు.
● ముంబైలోని బీజేపీ ఎమ్మెల్యే పరాగ్‌షా రూ.3,383 కోట్ల ఆస్తితో మొదటి స్థానంలో ఉన్నారు.
● రూ.1,413 కోట్ల ఆస్తులతో డీకేశి రెండవ స్థానంలో నిలిచారు.
● గౌరిబిదనూరు స్వతంత్ర ఎమ్మెల్యే కేహెచ్.పుట్టస్వామిగౌడ రూ.1267 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో, 4 వ స్థానంలో గోవిందరాజనగర ఎమ్మెల్యే ప్రియాకృష్ణ ఉన్నారు.
● 10వ స్థానంలో ఉన్న హెబ్బాల ఎమ్మెల్యే బైరతి సురేశ్‌కు రూ.1,156 కోట్లు ఆస్తులు ఉన్నాయి.
దేశంలో అత్యధిక మంది కర్ణాటక నుంచి ఉండడం చర్చనీయాంశమైంది. ఇక్కడి రియల్ ఎస్టేట్, పరిశ్రమలు, ఇతరత్రా రంగాల ద్వారా నేతలు కుబేరులవుతున్నారు.
రెండో ప్లేసులో డీకే శివకుమార్
టాప్–10లో బెంగళూరు నేతలు


