
ఖాళీగా ఇందిరా క్యాంటీన్
● ఆరా తీసిన ఉప లోకాయుక్త
శివమొగ్గ: శివమొగ్గ నగరంలో బుధవారం ఉదయం ఉప లోకాయుక్త జస్టిస్ కేఎన్ ఫణీంద్ర పలు చోట్ల ఆకస్మిక తనిఖీలు చేశారు. అక్కడక్కడ నెలకొన్న అవ్యవస్థను చూసి అధికారులపై మండిపడ్డారు. అలసత్వం ఇలాగే కొనసాగితే మీపై కేసులు పెడతానని హెచ్చరించారు. మహాత్మాగాంధీ పార్కులో నిర్లక్ష్యం మేట వేసిందని, తక్షణం ప్రజలకు మౌలిక వసతులను కల్పించాలని పాలికె కమిషనర్‌కు సూచించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి లోకాయుక్త డీఎస్పీ పార్కును పరిశీలిస్తారని, పురోగతి లేకపోతే కమిషనర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లపై కేసులు పెడతామని చెప్పారు. బీహెచ్ రోడ్డులోని ఇందిరా క్యాంటీన్‌కు వెళ్లారు. చవక ధరలకు టిఫిన్లు, భోజనాలు అందించే అక్కడ జనం లేకపోవడంపై అధికారులను ప్రశ్నించారు. ఆహార నాణ్యత బాగుందా లేదా అని ఓ వినియోగదారును ఆరా తీశారు. రాజేంద్రనగర బడావణె గుండా పారుతున్న తుంగా కాలువ మురుగుతో నిండి ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తనిఖీలతో అధికారుల్లో వణుకు పుట్టించాయి.