కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న దృశ్యం
రాయచూరు రూరల్: అధోపతనం వైపు పయనిస్తున్న ప్రభుత్వ పాఠశాలల అభ్యున్నతికి ప్రాముఖ్యతనివ్వాలని నగరసభ సభ్యుడు జయన్న వెల్లడించారు. ఆదివారం ప్రైవేట్ హోటల్‌లో భారత జ్ఞాన విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జ్యోతి వెలిగించి మాట్లాడారు. ప్రభుత్వ బడుల కంటే ప్రైవేట్ పాఠశాలలు మెరుగైన స్థితిలో ఉన్నాయన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలను పెంచేందుకు తోడు అభివృద్ధికి చొరవ తీసుకొనేలా ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. విద్యార్థులకు మౌలిక సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సమావేశంలో జయతీర్థ, హఫీజుల్లా, రాకేష్, సత్యనారాయణలున్నారు.


