
అధిక సంపాదన ఆశతో అవస్థలు
హోసూరు వార్తలు..
హోసూరు: హోసూరు, క్రిష్ణగిరి ప్రాంతాలకు చెందిన ప్రైవేట్ కంపెనీ ఉద్యోగులపై సైబర్ దొంగలు నిఘా పెట్టి లక్షల రూపాయలు దోచుకొంటున్నారని, ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలని క్రైం బ్రాంచ్ పోలీసులు హెచ్చరించారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు హోసూరు, క్రిష్ణగిరి ప్రాంతాల్లో నివాసముంటూ హోసూరు, బెంగళూరు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఐటి కంపెనీల్లో పనిచేస్తున్నారు. వీరిలో కొంత మంది ఇంటిలోనే ఉంటూ ఉద్యోగం చేస్తుంటారు. మరోవైపు ఆన్‌లైన్ ద్వారా పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ డబ్బులు సంపాదించాలని ఆశపడుతూ సైబర్ నేరగాళ్లకు చిక్కి ఉన్న డబ్బులను కూడా కోల్పోతున్నారు. ఇంటి వద్ద కంపెనీల పర్యవేక్షణ ఉండకపోవడం వల్ల సమయాన్ని వృథా చేయక పార్ట్ టైం ఉద్యోగాలు, వ్యాపారాలపై మక్కువ చూపడంతో సైబర్ దొంగలు వారి వద్ద ఉన్న డబ్బులను కాజేస్తున్నారని పోలీసులు తెలిపారు. సెల్‌ఫోన్‌లకు వచ్చే మెసేజ్‌లపై స్పందించరాదని, ఆన్‌లైన్ బిజినెస్‌పై మక్కువ చూపి మోసపోరాదని పోలీసులు పేర్కొన్నారు.
పోలీసుల హెచ్చరిక

సంఘ సమావేశంలో మాట్లాడుతున్న రామగౌండర్
Comments
Please login to add a commentAdd a comment