●నేడు బెళగావిలో మహాసభ
హుబ్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కురుబ సామాజిక వర్గం ఎస్టీ రిజర్వేషన్ కోసం పోరాటం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో మంగళవారం బెళగావి నగరంలో అఖిల భారత జాతీయ కురుబ సామాజిక మహాసభకు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశానికి దేశ నలుమూలల నుంచి రాజకీయ నేతలు వస్తున్నారు. వారి సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎస్టీ రిజర్వేషన్ కేటాయించాలనే డిమాండ్‌ను ప్రతిపాదిస్తామని చిక్కొడి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ రామచింగళె తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే కుల అధ్యయన నివేదిక బసవరాజ్ బొమ్మై సీఎంగా ఉన్న సమయంలో తీసుకున్నారని, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి మండలి ఆమోదం తీసుకొని సీఎం సిద్దరామయ్య కేంద్రానికి సమర్పించనున్నారు. కేంద్ర ప్రభుత్వం దీన్ని అమల్లోకి తేవాలని డిమాండ్ చేస్తామన్నారు.


