అదనపు కట్నం కోసం పోలీస్‌ అకృత్యాలు.. భార్యపై లాఠీచార్జీ | - | Sakshi
Sakshi News home page

అదనపు కట్నం కోసం పోలీస్‌ అకృత్యాలు.. భార్యపై లాఠీచార్జీ

Sep 4 2023 12:46 AM | Updated on Sep 4 2023 9:05 AM

- - Sakshi

పుట్టింటి నుంచి మరింత కట్నం తేవాలని వేధిస్తూ లాఠీతో కొడుతున్న పోలీసు కానిస్టేబుల్‌ ఉదంతమిది. వివరాలు..

కర్ణాటక: పుట్టింటి నుంచి మరింత కట్నం తేవాలని వేధిస్తూ లాఠీతో కొడుతున్న పోలీసు కానిస్టేబుల్‌ ఉదంతమిది. వివరాలు.. బాధితురాలు సహన భర్త సునీల్‌ కుమార్‌ తుమకూరు ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. అరసికెరెకు చెందిన సహనకు ఏడాదిన్నర క్రితం సునీల్‌కుమార్‌తో పెద్దలు పెళ్లి చేశారు. 67 గ్రాముల బంగారం ఇచ్చి, అలాగే రూ. 18 లక్షలు ఇచ్చి అరసికెరె వీరశైవ కళ్యాణ మండపంలో ఘనంగా వివాహం చేశారు.

పెళ్లయిన రెండు నెలల తర్వాత సహనకు బ్రెయిన్‌ ట్యూమర్‌ అని తెలిసి బెంగళూరు నిమ్హాన్స్‌ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించుకుంది. మరోవైపు అదనపు కట్నం కోసం సునీల్‌ కుమార్‌ వేధిస్తున్నాడు.

ఇల్లు కట్టాలని, కారు కొనాలని, రూ. 20 లక్షలు తీసుకుని రావాలంటూ ఒత్తిడి చేస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తంచేసింది. అంతేకాక లాఠీతో తరచూ కొడుతున్నాడని విలపించింది. తుమకూరు ఎస్పీని కలిసి అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు తుమకూరు మహిళ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement