స్నేహితులను భార్యపైకి లైంగికదాడికి ఉసిగొల్పే భర్త... | - | Sakshi
Sakshi News home page

స్నేహితులను భార్యపైకి లైంగికదాడికి ఉసిగొల్పే భర్త...

Jul 1 2023 7:05 AM | Updated on Jul 1 2023 7:08 AM

- - Sakshi

నువ్వు నాకు నచ్చావు, నిన్నే పెళ్లడతా అని వెంటపడ్డాడు. సరేనని ఆమె అంగీకరించింది, అలా ఇద్దరూ పరిచయమై ప్రేమలోకి మునిగిపోయారు. ఇద్దరూ ఐటీ ఉద్యోగులే కావడంతో డబ్బుకు లోటు లేదు, పెళ్లి చేసుకుని కాపురం పెట్టాక అతని నిజ స్వరూపం బయటపడింది. డ్రగ్స్‌ మత్తులో పడి కట్టుకున్న భార్యను వేధించడం ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా స్నేహితులను తీసుకొచ్చి సతాయించిన వికృత మనస్కుని దురాగతం ఇది.

కర్ణాటక: ప్రేమించి పెళ్ళి చేసుకున్న భర్త మద్యానికి, డ్రగ్స్‌కు బానిసై భార్యకు నరకం చూపెట్టాడు. ఇంట్లోనే మందు పార్టీలు నిర్వహించి స్నేహితులను భార్యపైకి లైంగికదాడికి ఉసిగొల్పే శాడిస్టు భర్త ఆగడాలపై భార్య పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన ఐటీ సిటీ బెంగళూరులో వెలుగుచూసింది.

మ్యాట్రిమోనియల్‌లో పరిచయమై
బాధితురాలి ఫిర్యాదు, హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్‌ పోలీసులు తెలిపిన మేరకు.. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన అఖిలేష్‌ ధర్మరాజ్‌ 2019లో మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్‌లో బెంగళూరుకు చెందిన ఒక యువతి ప్రొఫైల్‌ను చూసి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. తరువాత ఇద్దరూ ప్రేమించుకుని బెంగళూరు జయనగరలో రిజిస్టర్‌ పెళ్లితో ఒక్కటయ్యారు. ధర్మరాజ్‌ ఐటీ ఇంజనీర్‌ ఉద్యోగం చేసేవాడు, భార్య కూడా అదే ఉద్యోగం చేసేది.

పెళ్లయిన కొన్నాళ్లు బాగానే ఉన్న ధర్మరాజ్‌ తరువాత మద్యంతో పాటు డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. ఇంటికే డ్రగ్స్‌ తీసుకువచ్చి సేవించి ఆ మత్తులో భార్యను వేధించేవాడు. తరచూ స్నేహితులను ఇంటికి తీసుకొని వచ్చి మద్యం పార్టీలు చేసుకుంటూ డ్రగ్స్‌ వాడేవారు. ధర్మరాజ్‌ ఆ మత్తులో తన స్నేహితులతో కలిసి భార్యను లైంగికంగా వేధించేవాడు.

ప్రైవేటు వీడియోలు తీసి..
ధర్మారజ్‌ భార్య ప్రైవేట్‌ వీడియోలను తీసి వాటిని అందరికీ చూపించడంతో పాటు ఇంటర్నెట్లో పోస్ట్‌ చేస్తానని బెదిరించి, తమకు సహకరించాలని వేధించేవాడు. ఇంట్లోని పడక గదిలో, బాత్‌రూంలో సీసీ కెమెరాలను పెట్టి దృశ్యాలను రికార్డు చేసేవాడు. అతని వేధింపులను తట్టుకోలేక ఆమె పుట్టింటికి వెళితే ఫోన్‌ చేసి, అక్కడకి వచ్చి నీ వీడియోలు చూపించి గొడవ చేస్తా, లేదంటే చంపెస్తాని బెదిరించి పిలిపించుకునేవాడు.

తనతో పాటు తన స్నేహితులకు సహకరించాలని, లేదంటే చంపేస్తానని బెదిరించడంతో తాను మొదట సుబ్రమణ్యపుర పోలీసులకు ఫిర్యాదు చేయగా అక్కడ పట్టించుకోలేదని బాధితులు తెలిపింది. దీంతో ప్రస్తుతం నివాసం ఉంటున్న హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. కేసు నమోదు చేకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

డ్రగ్స్‌ మత్తులో భార్యకు నరకం

స్నేహితులతో కలిసి లైంగిక వేధింపులు

నిందితుడు కాకినాడ వాసి

పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement