ఈసారి నన్ను గెలిపించండి | - | Sakshi
Sakshi News home page

ఈసారి నన్ను గెలిపించండి

Apr 27 2023 5:53 AM | Updated on Apr 27 2023 5:53 AM

- - Sakshi

సాక్షి,బళ్లారి: ఈసారి ఎన్నికల్లో తనకు మద్దతు ఇచ్చి గెలిపిస్తే మీ సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని కేఆర్‌పీపీ అభ్యర్థి గాలి లక్ష్మీ అరుణ పేర్కొన్నారు. ఆమె బుధవారం నగరంలో జిల్లా చాంబర్‌ కామర్స్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యవర్గాన్ని కలిసి మాట్లాడారు. వేలాది మంది వ్యాపార, పారిశ్రామిక ప్రతినిధులందరూ పెద్ద మనస్సుతో తనను దీవించి గెలిపించాలని కోరారు.

గతంలో తన భర్త గాలి జనార్దనరెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా వ్యాపారుల సంక్షేమం, పరిశ్రమల స్థాపన కోసం శ్రమించారని గుర్తు చేశారు. నగరంలో పార్టీని గెలిపిస్తే మరింత ఉత్సాహంగా ఈ ప్రాంత అభివృద్ధికి శ్రమిస్తారన్నారు. ఓఎంసీ డైరెక్టర్‌ బీ.వీ.శ్రీనివాసరెడ్డి, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు శ్రీనివాసరావు, కార్యదర్శి యశ్వంత్‌రాజ్‌, ఉపాధ్యక్షుడు మంజునాథ్‌, ప్రముఖులు రమేష్‌బుజ్జి, దొడ్డనగౌడ, సొంతా గిరిధర్‌, పాలన్న, పార్టీ ప్రముఖులు వెంకటరమణ, సూరిబాబు, సురేష్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం కప్పగల్‌ రోడ్డులో ఇంటింటా ప్రచారం చేసి పుట్‌బాల్‌ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. పార్టీ మహిళా నాయకులు హంపీ రమణ, లీలా శ్రీనివాసరెడ్డి, పద్మ, వనజాక్షి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement