గురువారం శ్రీ 26 శ్రీ నవంబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

గురువారం శ్రీ 26 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

Nov 26 2026 12:12 AM | Updated on Nov 26 2026 12:12 AM

గురువారం శ్రీ 26 శ్రీ నవంబర్‌ శ్రీ 2026 పెడుతున్రు.. కొడుతున్రు!

న్యూస్‌రీల్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరంలో సుమారు 40 కిలోమీటర్ల మేర డివైడర్లు ఉండగా, అందులో 15 కిలోమీటర్ల మేర కోనోకార్పస్‌ చెట్లు విస్తరించాయి. ఇవి వేగంగా పెరిగి వీధిదీపాలకు అడ్డుగా మారుతుండటంతో తొలగింపు చేపట్టారు. గతంలో చెట్లను ఆకర్షణీయమైన ఆకృతుల్లో కత్తిరించేవారు. ప్రస్తుతం కార్మికులు, పనిముట్ల కొరతతో పూర్తిగా పెరిగే వరకు వదిలేసి, ఆ తర్వాత కింది నుంచి నరికివేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. హరితహారం విభాగంలో 59 మంది కార్మికులు ఉండగా, 24 మంది ట్యాంకర్లపై విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన 35 మందిని సైతం ఇతర పనులకు కేటాయిస్తుండటంతో డివైడర్ల నిర్వహణ సక్రమంగా సాగడం లేదు. చెట్లను క్రమం తప్పకుండా కత్తిరించి సంరక్షిస్తేనే సుందరీకరణ లక్ష్యం నెరవేరుతుందని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు.

నాటిన కోనోకార్పస్‌ చెట్లను పెరిగిన తర్వాత క్రమపద్ధతిలో కత్తిరించాల్సింది పోయి, నగరపాలక సంస్థ సిబ్బంది మొదటికే నరికివేస్తున్నారు. నెల రోజుల్లో మళ్లీ చిగురిస్తాయన్న అధికారుల సమర్థన ఉన్నప్పటికీ, అప్పటివరకు డివైడర్లు పచ్చదనానికి దూరమవుతున్నాయి. దీంతో నగర సుందరీకరణ కోసం చేపట్టిన గ్రీనరీ పనులు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement