15 మంది రౌడీషీటర్ల బైండోవర్‌ | - | Sakshi
Sakshi News home page

15 మంది రౌడీషీటర్ల బైండోవర్‌

Nov 26 2026 12:06 AM | Updated on Nov 26 2026 12:06 AM

● ఒక్కొక్కరికి రూ.లక్ష పూచీకత్తు ● శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసుల ముందస్తు చర్యలు

కరీంనగర్‌ క్రైం: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వివిధ పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని 15 మంది రౌడీ షీటర్లను బుధవారం బైండోవర్‌ చేశారు. పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం, అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ (ఎగ్జిక్యూటివ్‌) ఎదుట హాజరుపరిచి, బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్లు 126 నుంచి 136 ప్రకారం విచారణ నిర్వహించారు. ఏడాది పాటు సత్ప్రవర్తనతో ఉంటామని ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష పూచీకత్తుతో బాండ్లు తీసుకున్నారు. జమ్మికుంటలో ఇద్దరు, కరీంనగర్‌ టూ టౌన్‌లో ఇద్దరు, మిగిలిన 11 పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఒక్కొక్కరిని బైండోవర్‌ చేశారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

బైండోవర్‌ నిబంధనలు ఉల్లంఘించి తిరిగి నేరాలకు పాల్పడినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా పూచీకత్తు సొమ్ము జప్తు చేయడంతో పాటు చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సీపీ గౌస్‌ ఆలం హెచ్చరించారు. అవసరమైతే జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందన్నారు. నేరప్రవృత్తి కలిగిన వ్యక్తులపై నిరంతర నిఘా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement