● ముంబయి మేయర్‌తో కలిసి మహారాష్ట్ర సీఎంకు స్వాగతం
కరీంనగర్ కార్పొరేషన్: నగర మేయర్ కొలగాని శ్రీనివాస్‌కు ముంబయిలో ప్రారంభమైన అంతర్జాతీయ మేయర్ల సదస్సులో అరుదైన గౌరవం లభించింది. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన 30 నగరాల మేయర్లు పాల్గొనే ప్రపంచ మేయర్ల సదస్సు బుధవారం ముంబయిలోని ఫెయిర్‌మాంట్ హోటల్‌లో ప్రారంభమైంది. సదస్సు ప్రారంభానికి వచ్చిన ముఖ్యఅతిథి మహారాష్ట్ర ముఖ్య మంత్రి ఫడ్నవిస్‌కు ముంబయి మేయర్‌తో కలిసి నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ స్వాగతం పలికారు. దేశ,విదేశాల నుంచి ఎంతో మంది మేయర్లు ఉండగా, అధికారికంగా స్వాగతం పలికే అవకాశం లభించడం పట్ల మేయర్ శ్రీనివాస్ సంతోషం వ్యక్తంచేశారు. కాగా సదస్సులో మొదటిరోజు పట్టణాభివృద్ధి అంశంపై విస్తృతస్థాయిలో చర్చలు జరిగాయి. హిమాచల్ ప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు చెందిన పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు పాల్గొని భవిష్యత్‌నగరాల నిర్మాణం, మౌళిక సదుపాయాల కల్పన, పట్టణ ప్రాంతాల ఆధునీకరణపై దిశానిర్దేశం చేశారు. గురువారం సదస్సు ముగియనుంది.


