● జడ్జి సత్యరాజ్ కిరణ్
కరీంనగర్‌క్రైం: మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, విద్యార్థులు వాటికి దూరంగా ఉండాలని న్యాయమూర్తి జె.సత్యరాజ్ కిరణ్ సూచించారు. కరీంనగర్ ప్రకాశంగంజ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. డ్రగ్స్ వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్పరిణామాలను వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ, మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు.
ట్రియుండ్ శిఖరంపై జాతీయ పతాకం
కరీంనగర్‌సిటీ: ధర్మశాలలో నిర్వహిస్తున్న జాతీయ సాహస శిబిరంలో పాల్గొన్న శాతవాహన విశ్వవిద్యాలయానికి చెందిన 10 మంది ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు హిమాచల్‌ప్రదేశ్‌లోని 2,828 మీటర్ల ఎత్తైన ట్రియుండ్ శిఖరాన్ని అధిరోహించారు. కంటింజెంట్ లీడర్ డాక్టర్ కంపెల్లి అర్జున్ నేతృత్వంలో శిఖరాన్ని చేరుకున్న బృందం జాతీయ, ఎన్‌ఎస్‌ఎస్ పతాకాలను ఎగురవేసింది. ఈ సాహస యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన వలంటీర్లను వర్సిటీ వీసీ ప్రొఫెసర్ యు. ఉమేష్ కుమార్, రిజిస్ట్రార్, అధ్యాపకులు అభినందించారు.
క్వింటాల్ పత్తి రూ. 9,150
జమ్మికుంట : జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్‌లో బుధవారం క్వింటాల్ పత్తి రూ. 9,150 పలికింది. క్రయ విక్రయాలను ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్–2 కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.
పవర్ కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: కొత్త డీటీఆర్ ఏర్పాటు పనుల కారణంగా గురువారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరుమల టాకీస్ ఏరియా, వందన అపార్ట్‌మెంట్, మడేలేశ్వర స్వామి ఆలయ ప్రాంతం, వసుధ హోటల్ లైన్‌లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–2 ఏడీఈ ఎం. లావణ్య తెలిపారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కమాన్‌పూర్, బద్దిపల్లి, నాగులమల్యాల గ్రామాలతో పాటు వ్యవసాయ, గ్రానైట్ పరిశ్రమల ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు.
విశిష్ట సేవా పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం
విద్యానగర్(కరీంనగర్): వివిధ రంగాల్లో పదేళ్లుగా విశిష్ట సేవలందిస్తున్న క్రైస్తవ వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా, వైద్య సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ వేడుకల సందర్భంగా పురస్కారాలు అందజేయనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మొహమ్మద్ జలాలోద్దీన్ అక్బర్ తెలిపారు. వ్యక్తిగత విభాగంలో ఎంపికై న వారికి రూ.లక్ష, సంస్థల విభాగంలో ఎంపికై న వారికి రూ.2 లక్షల నగదు పురస్కారంతో పాటు జ్ఞాపిక అందజేస్తారు. అర్హులు డిసెంబర్ 4లోగా జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. వివరాలకు 9989727382 నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.


