● యువకుడి మృతి
● ఇద్దరి పరిస్థితి విషమం
ముస్తాబాద్: రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్–సిద్దిపేట ప్రధాన రహదారిపై బందనకల్ శివారులో సోమవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు. ముస్తాబాద్ మండలం బందనకల్‌కు చెందిన కస్తూరి మహేందర్‌రెడ్డి(24), అతని స్నేహితులు మొగిలిపూల భరత్(25), మారెడ్డి జశ్వంత్‌రెడ్డి(24) బైక్‌పై ముస్తాబాద్ వైపు వస్తున్నారు. అదే సమయంలో ముస్తాబాద్ నుంచి సిద్దిపేట వైపు వెళ్తున్న గుర్తుతెలియన డీసీఎం వ్యాన్ వీరి బైక్‌ను ఢీకొట్టి, కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది. బైక్‌పై ఉన్న కస్తూరి మహేందర్‌రెడ్డి చాతీకి, శరీరానికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. భరత్, జశ్వంత్‌రెడ్డిల ఎడమ చేయిలు పూర్తిగా తెగి కింద పడిపోయాయి. వ్యాన్ ఆపకుండా వెళ్లిపోయింది. సంఘటన స్థలం భయానకంగా మారింది. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి క్షతగాత్రులను అంబులెన్స్‌లో సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు. మృతుడు మహేందర్‌రెడ్డి కేసీఆర్ వద్ద పనిచేస్తున్నాడు. ఇటీవలే స్వగ్రామం బందనకల్‌కు వచ్చాడు. మహేందర్‌రెడ్డి తల్లి నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా, ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో తండ్రి నర్సారెడ్డి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. ప్రమాదానికి కారణమైన డీసీఎం వ్యాన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.


