చందుర్తి శివారులో కారు, బొలెరో ఢీ | - | Sakshi
Sakshi News home page

చందుర్తి శివారులో కారు, బొలెరో ఢీ

Nov 25 2026 12:20 AM | Updated on Nov 25 2026 12:20 AM

ఎనిమిది మందికి తీవ్ర గాయాలు

క్షతగాత్రులను 108లో ఆస్పత్రికి తరలింపు

చందుర్తి(వేములవాడ): రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రం శివారులోని కెనాల్‌ వద్ద మంగళవారం కారు, బొలెరో వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాద్‌ జిల్లా నందిపేటకు చెందిన కుటుంబ సభ్యులు కారులో వేములవాడ రాజన్న దర్శనానికి వస్తుండగా, హెచ్‌ఎం ప్రాజెక్టు పనుల్లో ఉన్న కాంట్రాక్టర్‌ సిబ్బంది బొలెరోలో వేములవాడ నుంచి రుద్రంగి వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో చందుర్తి శివారులో రెండు వాహనాలు ఢీకొన్నాయి. కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్‌ ధనుంజయ్‌, సాయి, హానిక, సరయ, సిద్దిత, సునీతతో పాటు బొలెరోలో ఉన్న దేవసిన్‌, సయ్యద్‌ కరీమ్‌ గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు 108 అంబులెన్స్‌లో వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారులోని ఎయిర్‌బ్యాగులు తెరుచుకోవడంతో ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పినట్లు స్థానికులు తెలిపారు. కారులో ఉన్న 11 ఏళ్ల చిన్నారికి రెండు చేతులు విరిగాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement