‘హ్యాండ్‌ బాల్‌’లో సత్తాచాటిన జిల్లా జట్లు | - | Sakshi
Sakshi News home page

‘హ్యాండ్‌ బాల్‌’లో సత్తాచాటిన జిల్లా జట్లు

Nov 25 2026 12:20 AM | Updated on Nov 25 2026 12:20 AM

‘హ్యాండ్‌ బాల్‌’లో సత్తాచాటిన జిల్లా జట్లు

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ 70వ రాష్ట్రస్థాయి అండర్‌–19 హ్యాండ్‌బాల్‌ టోర్నీ మంగళవారం ముగిసింది. మహబూబ్‌నగర్‌ హైస్కూల్‌ మైదానంలో ఉత్కంఠంగా సాగిన పోటీల్లో కరీంనగర్‌ బాలికల జట్టు రన్నరప్‌గా నిలవగా, బాలుర జట్టు మూడో స్థానంలో నిలిచింది. బహుమతుల ప్రదానోత్సవంలో హ్యాండ్‌బాల్‌ టోర్నీ రాష్ట్ర పరిశీలకులు రఫత్‌ ఉమర్‌, జి.శ్రీను, మహబూబ్‌నగర్‌ హైస్కూల్‌ ప్రిన్సిపాల్‌ శాంత, ఎస్‌జీఎఫ్‌ కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్‌, రజనికాంత్‌రెడ్డి, ఎండీ జియాఉద్దీన్‌, బాల్‌రాజు, రవికుమార్‌, శంకర్‌, అహ్మద్‌ హుస్సేన్‌, ప్రదీప్‌కుమార్‌, ముజిబుర్‌ రహెమాన్‌, సర్ఫరాజ్‌అలీ, అర్చన, నర్సింహ, రంజిత్‌కుమార్‌, ప్రణయ్‌, రియాజ్‌, చంద్రకాంత్‌ పాల్గొన్నారు.

– కరీంనగర్‌ స్పోర్ట్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement