● సిద్దిపేట జిల్లా పందిల్ల వద్ద రోడ్డు ప్రమాదం ● కొండాపూర్‌కు చెందిన తండ్రీకూతురు దుర్మరణం ● హైదరాబాద్ నుంచి దశదినకర్మకు వస్తుండగా ఘటన
చిగురుమామిడి: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శివారు.. పందిల్ల గ్రామ సమీపంలో చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన పైడిపెల్లి శ్రీకాంత్(33), ఆయన కూతురు మహాన్వి (7) మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శ్రీకాంత్ హైదరాబాద్‌లో క్యాబ్ డ్రైవర్‌గా ఏడేళ్లుగా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య స్వాతి, కుమారుడు విహాన్‌క్రిష్, కూతురు మహాన్వి ఉన్నారు. కొండాపూర్‌లో తన బంధువు దశదిన కర్మ ఉండడంతో కుటుంబంతో సహా కారులో బయల్దేరాడు. పందిల్ల శివారుకు చేరుకోగానే.. ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ వీరి కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీకాంత్, మహన్వీ అక్కడికక్కడే మృతి చెందారు. భార్య స్వాతి, కొడుకు విహాన్‌క్రిష్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. శ్రీకాంత్ తండ్రి గంగయ్య 20 ఏళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. తల్లి సుగుణవ్వ ఆర్నెళ్ల క్రితం తీర్థయాత్రలకు వెళ్లి అనారోగ్యంతో మృతిచెందింది. శ్రీకాంత్, స్వాతిది ప్రేమ వివాహం. శ్రీకాంత్‌కు ఇద్దరు అన్నదమ్ములు.


