గుర్తుతెలియని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని వ్యక్తి మృతి

Nov 10 2026 1:13 AM | Updated on Nov 10 2026 1:13 AM

కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రి వద్ద సోమవారం 60–65 ఏళ్ల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు టూ టౌన్‌ పోలీసులు తెలిపారు. మృతుడికి తెల్లగడ్డం, నల్లటి వెంట్రుకలు, చామనఛాయ రంగు, కుడిచేతికి ఎరుపు, నలుపు రంగుల మొలధారాలు ఉన్నాయన్నారు. పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ జీవించేవాడని తెలిసిందని మృతుడి ఆచూకీ తెలిసిన వారు కరీంనగర్‌ టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.

రైలు ప్రమాదంలో విద్యార్థి..

ఓదెల: ఓదెల గ్రామానికి చెందిన ఇంటర్‌ విద్యార్థి అహ్మద్‌ ఫరాన్‌(17) ఆదివారం కాజీపేట వద్ద ప్రమాదవశాత్తు రైలు కిందపడి మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. ఓదెలకు చెందిన ఎండీ రఫీ కుటుంబం ఉపాధి రీత్యా హైదరాబాద్‌లో స్థిర పడింది. పెద్ద కుమారుడు అహ్మద్‌ ఫరాన్‌ అక్కడే ఇంటర్‌ ఫస్టీయర్‌ చదువుతున్నాడు. గోదావరిఖనిలో బంధువుల వద్దకు వచ్చాడు. ఆదివారం రామగుండం నుంచి సికింద్రాబాద్‌కు సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం చేస్తుండగా ప్రమాదవశాత్తు రైలుకింద పడి మృతిచెందాడు. మృతుడి అంత్యక్రియలు ఓదెలలో జరిగాయి.

అమెరికాలో రామన్నపేట వాసి..

మల్యాల: మండలంలోని రామన్నపే గ్రామానికి చెందిన వెల్మ రిషి రెడ్డి అమెరికాలో తాను చదువుకుంటున్న యూనివర్సిటీ హాస్టల్‌ గదిలో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. గ్రామానికి చెందిన వెల్మ నర్సింహారెడ్డి కుటుంబంతో మూడు దశాబ్దాల క్రితం అమెరికాలోని ఒహాయో సిటీలో స్థిరపడ్డాడు. ఆయన కుమారుడు రిషి రెడ్డి బీటెక్‌ చదువుతున్నాడు. కొద్దిరోజుల్లో గ్రాడ్యుయేషన్‌ డేలో పాల్గొనాల్సి ఉంది. ఈ క్రమంలో గదిలో అనుమానస్పదంగా మృతి చెందినట్లు ఇక్కడకు సమాచారం అందింది. డిసెంబర్‌లో స్వగ్రామానికి వచ్చేందుకు కుటుంబసభ్యులందరూ విమాన టికెట్లు బుక్‌ చేసుకున్నారని, ఇంతలోనే రిషిరెడ్డి సర్టిఫికెట్ల కోసం వెళ్లి మృత్యువాత పడడం విషాదం నింపింది.

భవనం రెండో అంతస్తు నుంచి పడి వివాహిత..

కరీంనగర్‌క్రైౖం: బట్టలు ఆరవేస్తుండగా ప్రమాదవశాత్తు భవనంలోని రెండో అంతస్తు బాల్కనీ నుంచి కిందపడి ఓ వివాహిత మృతి చెందిన ఘటన కరీంనగర్‌లోని విద్యానగర్‌లో చోటుచేసుకుంది. కరీంనగర్‌ టూటౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యానగర్‌కు చెందిన మేడి శైలజ (40) తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి తన తండ్రి లచ్చయ్య ఇంట్లో ఉంటోంది. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో మైనింగ్‌ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న భర్త రాజేశం అప్పుడప్పులు ఇంటికి వచ్చి వెళ్తుంటాడు. ఆదివారం సాయంత్రం రాజేశం ఇంటికి రాగా సోమవారం తెల్లవారుజామున శైలజ నిద్రలేచి బట్టలు ఉతికి రెండో అంతస్తు బాల్కనీలో ఆరవేస్తుండగా ప్రమాదవశాత్తు అదుపుతప్పి కిందపడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా మృతి చెందింది. శైలజ తండ్రి లచ్చయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కరీంనగర్‌ టూ టౌన్‌ పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement