సైదాపూర్: మండలంలోని ఘనపూర్ గ్రామంలో సోమవారం సాయంత్రం మంచికట్ల అజయ్ (20) దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు.. శంకరపట్నం మండలం మెట్‌పల్లికి చెందిన అజయ్, మాణిక్యాపూర్‌కు చెందిన సాయికుమార్ హుజూరాబాద్‌లోని ఓ బైక్ మెకానిక్ షాపులో పనిచేస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా షాపు యజమాని కొండ్రోజ్ శ్రీనివాస్ స్వగ్రామం ఘనపూర్‌లో వర్కర్లకు దావత్ ఇచ్చాడు. విందు ముగించుకుని అజయ్, సాయికుమార్ ఇద్దరూ బైక్‌పై తిరిగి హుజూరాబాద్ వెళ్తుండగా.. ఘనపూర్ అంబేడ్కర్ చౌరస్తా వద్ద వెనుక కూర్చున్న సాయికుమార్ తన వెంట తెచ్చుకున్న సుత్తెతో అజయ్ తలపై బలంగా బాదాడు. తీవ్ర గాయంతో అజయ్ అక్కడికక్కడే మృతి చెందగా సాయికుమార్ పరారయ్యాడు. ఓనర్‌కు అజయ్ దగ్గరవుతున్నాడనే అనుమానంతోనే హెడ్ మెకానిక్‌గా పనిచేసే సాయికుమార్ హత్యకు ఒడిగట్టి ఉంటాడని భావిస్తున్నారు. హుజూరాబాద్ రూరల్ సీఐ శ్రీనివాస్ ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు. హత్యకు గల కారణాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.


