ప్రజా ఆరోగ్యం ‘సీజ్‌’ | - | Sakshi
Sakshi News home page

ప్రజా ఆరోగ్యం ‘సీజ్‌’

Nov 10 2026 1:13 AM | Updated on Nov 10 2026 1:13 AM

● సీజ్‌ చేసినా ఆగని దందా ● అన్నింటా కల్తీ.. ఆరోగ్యం సుస్తీ ● అయిదు రోజుల్లో కేఎఫ్‌సీ, మండీ సీజ్‌ ● తనిఖీ చేసే ప్రతీ చోట అంతులేని నిర్లక్ష్యం

ఆహార భద్రతా శాఖ సిబ్బంది ఇలా

అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ : 01

గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ : 01

ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ : 01

జూనియర్‌ అసిస్టెంట్‌ : 01

శాంపిళ్లు సేకరించేవారు :02(ఔట్‌ సోర్సింగ్‌)

అటెండర్‌ :01(ఔట్‌ సోర్సింగ్‌)

ఈనెల 8న కరీంనగర్‌ కోర్టు చౌరస్తాలోని ‘మండీ 29 అరేబియన్‌ రెస్టారెంట్‌’ను ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన మయోనైజ్‌ను తయారు చేసి వినియోగదారులకు అందిస్తున్నారని గుర్తించారు. సింథటిక్‌ ఫుడ్‌కలర్స్‌ వినియోగం, వాడిన నూనెను మళ్లీ వినియోగించడం వంటివి గుర్తించారు. దీంతో లైసెన్స్‌ సస్పెండ్‌ చేయడంతోపాటు సీజ్‌ చేశారు.

కరీంనగర్‌ అర్బన్‌: నోరూరించే బిర్యానీ పిలుస్తోందా.. చైనీస్‌ ఫాస్ట్‌ఫుడ్‌ రారమ్మంటుందా.. అయితే ఇవన్నీ అనారోగ్యం అంటగట్టేందుకే ఆహ్వానిస్తున్నట్లే. జిల్లాలోని చాలా మటుకు హోటళ్లు, రెస్టారెంట్లలో కల్తీ ఆహార పదార్థాలు.. వాడిన నూనెనే మళ్లీ.. మళ్లీ వాడడం రివాజుగా మారింది. అధికారులు తనిఖీ చేస్తున్నా వ్యాపారులకు భయం లేకుండా పోయింది. హోటళ్లు.. పండ్లబండ్లు.. టిఫిన్‌సెంటర్లు..రెస్టారెంట్లు.. సూపర్‌మార్కెట్లు.. ఎక్కడికి వెళ్లినా కల్తీ ఆహారపదార్థాలే అంటగడుతున్నారు. తమ లాభాలు చూసుకుంటున్న వ్యాపారులు ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు.

అన్నింటా నిర్లక్ష్యమే..

రెస్టారెంట్లు, బిర్యాని పాయింట్లు, టిఫిన్‌ సెంటర్లు, కార్పొరేట్‌ సూపర్‌ బజార్లలోనూ కల్తీ వ్యాపారం సాగుతోందని తేలింది. సదరు నమూనాల్లో 40 ఆరోగ్యానికి హానికరమని ఫలితాలు వచ్చాయి. పండ్లు, నూనె, తినుబండారాల్లో హానికరమైన రసాయనాలు ఉన్నట్లు ఫలితాలు రావడం దిగ్భ్రాంతికరం. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని గంజ్‌, భాగ్యనగర్‌, శాసీ్త్రరోడ్డు, గణేశ్‌నగర్‌, రాంపూర్‌ ఏరియాల్లో గతంలో నూనెకు సంబంధించి ఆరు నమూనాలు తీసుకోగా అవన్నీ ఆరోగ్యకరం కాదని తేలింది.

కేసులవుతున్నా భయమేదీ

ఫుడ్‌ వ్యాపారాల్లో లోపాలు గుర్తించి అధికారులు సీజ్‌ చేస్తున్నా, నోటీసులు జారీ చేసినా భయం లేదంటే చట్టంలో లోపాలే కారణమని తెలుస్తోంది. తనిఖీ సమయంలో లోపాలుంటే నోటీసులు జారీ చేయడం, ప్రజా ఆరోగ్యానికి ముప్పు అని తేలితే సీజ్‌ చేయడం ఫుడ్‌ సేఫ్టీ అధికారులు చేసే పని. ఈ ప్రక్రియలో నిర్వాహకులు జరిమానా చెల్లించి పేర్లు మార్చి మరో పేరుతో వ్యాపారం సాగిస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని గతంలోనే సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేయగా సదరు దాఖలాలు జిల్లాలో కనిపించడం లేవు.

బహుముఖ బాధ్యతలు.. అరకొర తనిఖీలు

గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ రోహిత్‌రెడ్డి, అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ జోడు పదవులతో ఉన్నారు. రోహిత్‌రెడ్డి ఐదు జిల్లాల వరకు ఇన్‌చార్జి కాగా ఫుడ్‌ కంట్రోలర్‌ 9 జిల్లాలకు ఇన్‌చార్జి. ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్‌ అంకిత్‌రెడ్డి మాత్రమే తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లా జనాభాకు అనుగుణంగా పోస్టులు లేకపోగా ఉన్న పోస్టులను ఇతర జిల్లాలకు మళ్లించడం ప్రజా ఆరోగ్యాన్ని గాలికొదిలేయడమే. ఆహార తనిఖీ విభాగం ప్రతీ నెలలో తప్పనిసరిగా తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుంది. గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్లకు ఒక్కొక్కరికి నిర్ణీత లక్ష్యం ఉంటుంది. కానీ పలు బాధ్యతలు, విధులు మారడం ఆందోళనకర పరిణామం. కాగా ఆహారకల్తీ, నాసిరకం పదార్థాల వినియోగంపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తామని, ఎవరినీ వదలబోమని గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ రోహిత్‌రెడ్డి వివరించారు.

జిల్లాలో హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు :సుమారు 2,500

నూనె విక్రయ కేంద్రాలు : 1,800

సూపర్‌ మార్కెట్లు : 320

బేకరీలు, స్వీట్‌ దుకాణాలు : 1,020

టిఫిన్‌ సెంటర్లు : 2,100

మసాలాల విక్రయ దుకాణాలు : 600

ప్రభుత్వ, ప్రైవేట్‌ హాస్టళ్లు : 450

పండ్ల దుకాణాలు : 1,500

చిరుతిళ్ల తయారీ కేంద్రాలు : 54

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement