భర్త వేధింపులతో ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

భర్త వేధింపులతో ఆత్మహత్య

Nov 10 2026 1:13 AM | Updated on Nov 10 2026 1:13 AM

కరీంనగర్‌రూరల్‌: కరీంనగర్‌ మండలం ఇరుకుల్ల లో భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్యకు పాల్పడిందని కరీంనగర్‌రూరల్‌ సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ జిల్లాకు చెందిన ఇమ్మడి ముత్తయ్య 11 ఏళ్ల క్రితం తన కూతురు స్రవంతి(35)ని ఇరుకుల్లకు చెందిన కొత్తూరి సంపత్‌కు ఇచ్చి వివాహం జరిపించాడు. ఇద్దరు కుమార్తెలు సంతానం కాగా, ఆర్నేళ్ల నుంచి సంపత్‌ తన భార్య స్రవంతిని తండ్రి వద్ద ఉన్న ప్లాటు అమ్మి డబ్బులు తీసుకరావాలని వేధిస్తున్నాడు. పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ అయిన ప్పటికి సంపత్‌ వేధింపులు కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో భర్త వేధింపులను తట్టుకోలేక సోమవారం తెల్లవారుజామున 5.30గంటలకు స్రవంతి ఇంట్లో చీరెతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన కూతురు మృతి చెందడానికి భర్త వేధింపులే కారణమని తండ్రి ముత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. నిందితుడు సంపత్‌ ఆచూకీ కోసం గాలిస్తున్నామని, దర్యాప్తు ఆధారంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement