60 ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న కొండగట్టు ఆంజనేయస్వామి చందనోత్సవాన్ని విజయవంతం చేయాలి. ఆరు రోజులపాటు స్వామివారి దర్శనం నిలిపివేస్తాం. స్వామివారిపై నుంచి తొలగించిన పవిత్రమైన చందనాన్ని భక్తులకు అందుబాటులో ఉంచుతాం. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
– అంజనారెడ్డి, ఆలయ ఈవో
ఘనంగా చందనోత్సవాలు
ఇద్దరు పీఠాధిపతులతోపాటు వేద పండితుల ఆధ్వర్యంలో చందనోత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం. ఆరు రోజులపాటు స్వామివారిపై చందనాన్ని దేవతా వృక్షాల కర్రలతో ప్రత్యేకంగా తయారు చేసిన పరికరాలు ఉపయోగించి తొలగిస్తాం. అనంతరం స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు కల్పిస్తాం.
– జితేంద్రస్వామి, ఆలయ ప్రధాన అర్చకుడు


