గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, ఆన్లైన్లో పేర్లు నమోదు కాని కార్మికుల పేర్లను నమోదు చేయాలని గ్రామ పంచాయతీ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో పలువురు మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా పని చేస్తున్న మల్టీపర్పస్ వర్కర్లకు 2 నెలలుగా వేతనాలందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 200 మంది కార్మికుల పేర్లు ఆన్లైన్లో నమోదు కాలేదన్నారు. కొందరికి 6 నుంచి 18 నెలల వరకు వేతనాలు పెండింగ్లో ఉన్నాయన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, పంచాయతీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పుల శంకర్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఉప్పునూటి శ్రీనివాస్, యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు రుద్రారపు నాంపల్లి, గాజర్ల రాజు, అలిశెట్టి రామానుజం, మహంకాళి కొమురయ్య, ఆకునూరి సుధాకర్, మేకల కమలాకర్, బొజ్జ మదనక్క, వడ్డూరి లక్ష్మీనారాయణ, కాష్పాక శంకర్, వేల్పుల రాములు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. – కరీంనగర్టౌన్


