మల్యాల: ఆధ్యాత్మిక ఉత్సవాలకు కొండగట్టు సిద్ధమవుతోంది. భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగా రం కొండగట్టు అంజన్న 60 వసంతాల అనంతరం చందనోత్సవానికి ముస్తాబవుతున్నాడు. స్వామివారి నిజరూప దర్శనంతో కొండగట్టులో ఆధ్యాత్మికత పరిమళాలు వెదజల్లనున్నాయి. స్వామివారి నిజరూప దర్శనం చేసుకు నే భాగ్యంతో భక్తుల జన్మ పునీతం కానుంది. ఆ రు రోజులపాటు నిర్వహించే చందనోత్సవం, మ హా సంప్రోక్షణ అనంతరం భక్తులకు స్వామివారి నిజ రూప దర్శన భాగ్యం 40 రోజులపాటు కలగనుంది.
ఆరు రోజులు చందనోత్సవం.. ఆర్జిత సేవలు రద్దు
కొండగట్టు అంజన్న ఆలయం హనుమాన్ జయంతిని మించిన ఆధ్యాత్మిక ఉత్సవాలకు ముస్తాబవుతోంది. 60 ఏళ్లుగా ప్రతీ మంగళ, శనివారాల్లో స్వామివారికి చందనంతో పూజలు కొనసాగుతుండగా, స్వామివారి మూలవిరాట్టుపై పేరుకుపోయిన చందనాన్ని దేవతా వృక్షాల కర్రలతో తొలగించేందుకు చందనోత్సవం నిర్వహించనున్నారు. ఈనెల 15 నుంచి 20 వరకు స్వామివారి మూలవిరాట్టు దర్శనంతోపాటు ఆర్జిత సేవలు రద్దు చేయనున్నారు. చెక్కతో చేసిన స్వామివారి మూర్తి దర్శనంతోపాటు, శ్రీ వేంకటేశ్వరస్వామి, అమ్మవారి దర్శనంతోపాటు, స్వామివారి దర్శనం కల్పించనున్నారు. చందనోత్సవానికి బెంగళూరు జీయర్‌స్వామి, విజయవాడ జీయర్‌స్వామితోపాటు, 50మందికిపైగా వేద పండితులు, అర్చకుల ఆధ్వర్యంలో చందనోత్సవాలు నిర్వహిస్తారు. స్వామివారి శక్తిస్వరూపాన్ని కలశంలోకి ఆవాహనం చేసి, యాగశాలలో నిత్యం ఐదు గుండాల హోమాలు నిర్వహిస్తారు. ఆరో రోజు స్వామివారి శక్తిని కలశం నుంచి మూలవిరాట్టుకు ఆవాహనం చేసి, పునఃప్రతిష్ట చేయనున్నారు. స్వామివారి ఆలయ గోపురంపై సుదర్శన చక్రం ప్రతిష్ఠాపన, రాజగోపురంపై కలశ కుంభాషేకం నిర్వహిస్తారు.
తరలిరానున్న భక్తులు
60 ఏళ్లుగా ఆంజనేయస్వామి మూలవిరాట్టుపై పేరుకుపోయిన చందనాన్ని తొలగించేందుకు యాగశాలలో నిత్య హోమాలు నిర్వహిస్తారు. ప్రత్యేకంగా రూపొందించిన పరికరాలతో చందనాన్ని తొలగిస్తూ స్వామివారి నిజరూప దర్శనం కల్పిస్తారు. స్వామివారి నిజరూప దర్శనం 40 రోజులపాటు కల్పించనుండటంతో నిత్యం సుమారు 50వేల మంది భక్తులు వస్తారనే అంచనా మేరకు ఆలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. చందనోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు.
ఆంజనేయస్వామి మూలవిరాట్టు
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం
చందనోత్సవాలకు ఆంజనేయస్వామి ముస్తాబు
40 రోజులపాటు భక్తులకు స్వామివారి నిజరూప దర్శన భాగ్యం
అంజన్న నామస్మరణతో పులకించనున్న కొండగట్టు


