కరీంనగర్ అర్బన్: రాజనీతిజ్ఞుడు, ఉక్కు మనిషి అయిన సర్దార్ వల్ల భాయ్ పటేల్ స్ఫూర్తితో దేశ సమైక్యత, సమగ్రతను పెంచేందుకు కృషి చేద్దామని కలెక్టర్ చిత్రామిశ్రా అన్నారు. దేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఐడీఓసీలో జాతీయ ఐక్యతా దినోత్సవం నిర్వహించారు. కలెక్టర్, అధికారులు, సిబ్బంది రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ చేశారు. కుల,మతాలు, ప్రాంతాలకతీతంగా మహనీయులు చూపిన బాటలో నడుస్తూ దేశ అభివృద్ధిలో అందరు భాగస్వాములు కావాలన్నారు. డీఆర్వో స్వామి పాల్గొన్నారు.


