కొడిమ్యాల: నాకు 96 ఏళ్లు. ఎలాంటి నొప్పులు, దీర్ఘకాలిక వ్యాధులు లేవు. ఇందుకు కారణం చిన్నప్పటి నుంచి శాకాహారమే తింటాను. ఇప్పటివరకు అసలు మాంసాహారమే ముట్టలేదు. పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, స్వచ్ఛమైన పాలు, పెరుగు తీసుకుంటా. బయటి ఆహారం అసలే అలవాటు లేదు. ఇంట్లో వండేదే తింటా. ఆ అలవాట్లే నన్ను ఈ వయసులోనూ ఏ రోగాల బారిన పడకుండా కాపాడాయి. నా తోటివారు మోకాళ్ల నొప్పులు, బీపీ, షుగర్ అని ఇబ్బంది పడుతుంటే, నేను ఇప్పటికీ నా పనులు సొంతంగా చేసుకుంటాను.
– కోల మల్లవ్వ, నాచుపల్లి, కొడిమ్యాల


