ఖైదీలకు అవగాహన | - | Sakshi
Sakshi News home page

ఖైదీలకు అవగాహన

Nov 1 2026 4:49 AM | Updated on Nov 1 2026 4:49 AM

కరీంనగర్‌క్రైం: జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జిల్లాజైలులో ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ము ఖ్య అతిథిగా పాల్గొన్న డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి యశ్వంత్‌సింగ్‌ మాట్లాడుతూ ఆర్థిక స్థోమత లేని ఖైదీలు ఉచిత న్యా యసాయం పొందడం రాజ్యాంగబద్ధమైన హ క్కు అన్నారు. ఉచిత న్యాయసేవలు, బెయిల్‌ విధానం, లోక్‌ అదాలత్‌ ద్వారా కేసుల పరిష్కారంపై అవగాహన కల్పించారు. మహిళా ఖైదీల విభాగాన్ని సందర్శించి, లీగల్‌ ఎయిడ్‌ హెల్ప్‌ డెస్క్‌ను పరిశీలించారు.

నేర నిరూపణలో పురోగతి

కరీంనగర్‌క్రైం: నేరస్తులకు శిక్షలు పడేలా కేసులను పక్కా సాక్ష్యాధారాలతో న్యాయస్థానాల్లో నిరూపించడంలో కరీంనగర్‌ కమిషనరేట్‌ పు రోగతి సాధించిందని సీపీ గౌస్‌ ఆలం తెలిపా రు. 2025లో 33.70 శాతంగా ఉన్న కన్విక్షన్‌ రేటు 2026లో 41.73 శాతానికి పెరిగిందన్నా రు. ఈ ఏడాది ఇప్పటివరకు పరిష్కారమైన 2,013 క్రిమినల్‌ కేసుల్లో 840 కేసుల్లో నేరం రు జువైందని, ఏడు హత్య కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు పడిందని వెల్లడించారు. తాజాగా కరీంనగర్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని హత్యాయత్నం కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష, టూటౌన్‌ పరిధిలోని హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ న్యాయస్థానాలు తీర్పునిచ్చాయని తెలిపారు. నేర నిరూపణల సంఖ్య 25కు చేరిందన్నారు. కేసుల దర్యాప్తు, నేర నిరూపణలో ప్రతిభ కనబరిచిన పోలీసులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, కోర్టు సిబ్బందిని సీపీ సత్కరించి ప్రశంసించారు.

పార్లమెంట్‌లో ఎస్సారార్‌ విద్యార్థిని గళం

కరీంనగర్‌సిటీ: భారతదేశ ఉక్కుమనిషి సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ 151వ జయంతి సందర్భంగా పార్లమెంట్‌లో నిర్వహించిన ప్రత్యేక వికసిత్‌ భారత్‌ కార్యక్రమంలో కరీంనగర్‌లోని ఎస్సారార్‌ ప్రభుత్వ కళాశాల విద్యార్థిని ఎం.శ్రీనిత్య ప్రసంగించారు. రాష్ట్రం నుంచి అవకాశం పొందిన ఏకై క వ్యక్తిగా శ్రీనిత్య నిలిచారు. భారత పార్లమెంట్‌ వేదికపై ప్రాతినిధ్యం వహించడం కళాశాలకు ఎంతో గర్వకారణం అని ప్రిన్సిపాల్‌ కె.రామకృష్ణ, వైస్‌ ప్రిన్సిపాల్స్‌ పి.నితిన్‌, టి.రాజయ్య కొనియాడారు.

సేంద్రియ సాగుతో ఆరోగ్యం

కరీంనగర్‌రూరల్‌: సేంద్రియ విధానంలో పంటలను సాగు చేయడం ద్వారా నేల ఆరోగ్యంగా ఉంటుందని జిల్లా వ్యవసాయాధికారి ఛత్రునాయక్‌ అన్నారు. శనివారం కరీంనగర్‌ మండలం చెర్లభూత్కూర్‌లో నిర్వహించిన ఖేత్‌ బచా వో అభియాన్‌ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రైతులు సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం చేస్తూ భూమిని కాపాడాలన్నారు. ఏడీఏ రణధీర్‌, ఏవో సత్యం పాల్గొన్నారు.

కూరగాయలు పండించాలి

కొత్తపల్లి: రైతులు కూరగాయలు, పూలసాగును చేపట్టి అధిక లాభాలు పొందాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి జగన్మోహన్‌ రెడ్డి సూచించారు. కొత్తపల్లి మండలం బద్దిపల్లి, కొండాపూర్‌ గ్రామాల్లో శనివారం క్షేత్రస్థాయి పర్యటించిన ఆయన కూరగాయల పందిరి సాగు, బంతి పూల పంటలను పరిశీలించారు. బీర, కాకర, దొండ వంటి తీగజాతి కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు సిమెంట్‌ లేదా రాతి స్తంభాలతో శాశ్వత పందిరి నిర్మాణం చేపట్టడానికి ఉద్యానశాఖ ద్వారా ఎకరానికి రూ.లక్ష సబ్సిడీ అందజేస్తున్నట్లు తెలిపారు. కొండాపూర్‌లో సుమారు 50 మంది రైతులు కూరగాయలు సాగు చేస్తూ, కరీంనగర్‌ సమీపంలో ఉండటంతో పంటలను సులభంగా మార్కెటింగ్‌ చేసుకుంటున్నారని తెలుసుకొని అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement