పెద్దపల్లి: ఇతడి పేరు టి.ప్రతాప్‌సింగ్. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సమీపంలోని మంగళపల్లి. కొద్దిరోజులుగా తీవ్రఅనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సింగరేణి ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణలో ఇతడు ఇంటిని, కొంత వ్యవసాయ భూమిని కోల్పోయాడు. ఇప్పటివరకూ పరిహారం రాలేదు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి అంబులెన్స్‌లోనే కుటుంబ సభ్యుల సాయంతో వచ్చాడు. తనకు పరిహారం ఇప్పించి ఆదుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్షకు విన్నవించాడు. పరిహారం వస్తేనే తనకు చికిత్స అందుతుందని కన్నీటిపర్యంతమయ్యాడు.


