లంచగొండి ఖాకీలపై వేటు! | - | Sakshi
Sakshi News home page

లంచగొండి ఖాకీలపై వేటు!

Oct 8 2026 12:30 AM | Updated on Oct 8 2026 12:30 AM

● సీఐ, ఎస్సై, కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌ గ్రామాల అభివృద్ధే లక్ష్యం

● సీఐ, ఎస్సై, కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌

తిమ్మాపూర్‌: అక్రమంగా మొరం తవ్వకాలు జరుపుతున్నారని పట్టుకున్న జేసీబీ, మూడు ట్రాక్టర్లను రిలీజ్‌ చేయడానికి లంచం డిమాండ్‌ చేసి రూ.30 వేలు వసూలు చేసిన పోలీసులపై వేటు పడింది. ‘లంచమిస్తేనే రిలీజ్‌’ శీర్షినక ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై సీపీ విచారణకు ఆదేశించారు. విచారణలో లంచం తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో సస్పెన్షన్‌ వేటు వే శారు. తిమ్మాపూర్‌ సీఐ బొల్లం రమేశ్‌, ఎల్‌ఎండీ ఎస్సై అన్వర్‌, కానిస్టేబుల్‌ తిమ్మాపూర్‌ చెరువులో మొరం తవ్వుతున్న బాబుకు చెందిన జేసీబీ, మూడు ట్రాక్టర్లను పదిరోజుల క్రితం పట్టుకుని తహసీల్దార్‌కు అప్పగించారు. బాబు నిబంధనల ప్రకారం రూ.25 వేల జరిమానా డీడీ రూపంలో చెల్లించాడు. తహసీల్దార్‌ రిలీజ్‌ ఆర్డర్‌ ఇచ్చారు. ఆర్డర్‌ తీసుకుని ఎల్‌ఎండీ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లగా సీఐ రమేశ్‌, ఎస్సై అన్వర్‌ వాహనాల రిలీజ్‌కు రూ.లక్ష లంచం డిమాండ్‌ చేశారు. రూ.50 వేలకు ఒప్పందం చేసుకుని రూ.30 వేలు తీసుకున్నారు. ఇందులో కానిస్టేబుల్‌ కూడా భాగమయ్యాడు. ఆ తర్వాత బాధితుడిని మరో రూ.లక్ష తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. దీనిపై ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. విచారణ అనంతరం ముగ్గురిపై సస్పెన్షన్‌ వేటు వేసినట్లు కరీంనగర్‌ రూరల్‌ ఏసీపీ విజయ్‌ కుమార్‌ తెలిపారు. కాగా.. ఎల్‌ఎండీ ఇన్‌చార్జి ఎస్సైగా టూటౌన్‌ ఎస్సైగా ఉన్న అరుణ్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు బాధ్యతలు స్వీకరించారు.

చిగురుమామిడి: రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చిన తరువాత గ్రామాల్లో రూ.కోట్లతో అభివృద్ధి జరుగుతోందని రవాణా, బీసీసంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. చిగురుమామిడి మండలం ముదిమానిక్యం, రామంచ, చిన్నముల్కనూర్‌, పీచుపల్లి, సీతారాంపూర్‌ గ్రామాల్లో బుధవారం ‘పల్లెపల్లెకు పొన్నం అన్న– పల్లెపల్లెలో ప్రజాపాలన’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నీటిని సంరక్షించుకోవాలన్నారు. రైతులు వరితో పాటు ఆయిల్‌ఫాం తోటలు సాగు చేయాలన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే శిబిరాల్లో ఆరోగ్య పరీక్షలు చేసుకుని, అవసరమైన మందులు తీసుకోవాలన్నారు. మహిళలు తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లించి, మళ్లీ రుణాలు పొందాలన్నారు. కలెక్టర్‌ చిత్రామిశ్రా, ఆర్డీవో షర్మిల, డీఏవో ఛత్రునాయక్‌, హుస్నాబాద్‌ ఏఎంసీ చైర్మన్‌ కంది తిరుపతిరెడ్డి, ఫ్యాక్స్‌ చైర్మన్‌ చిటుమల్ల రవీందర్‌, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు అందె సురేశ్‌ పాల్గొన్నారు.

తూకంలో తేడాపై కొరడా

కరీంనగర్‌ అర్బన్‌: తూనికలు, కొలతలశాఖ అధికారులు తూకంలో మోసాలపై కొరడా ఝుళిపించారు. ఈ నెల 2న ‘సాక్షి’లో ‘తూకం.. తిరకాసు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందిస్తూ ఏకకాలంలో దాడులు నిర్వహించారు. అసిస్టెంట్‌ కంట్రోలర్‌ సిద్ధార్థ కుమార్‌ ఆదేశాలతో జిల్లా అధికారి అజిజ్‌పాషా, ఇన్‌స్పెక్టర్‌ కె.వెంకటయ్య నగరంలో మూడు రోజు ల పాటు తనిఖీలు చేపట్టారు. 8 దుకాణాల్లో తూకం యంత్రాల్లో వ్యత్యాసం రావడంతో కేసులు నమోదు చేసినట్లు వివరించారు.

డీఈవోగా విజయసాగర్‌

కరీంనగర్‌ టౌన్‌: కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాల డీఈవోగా జె.విజయసాగర్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ డాక్టర్‌ ఈ.నవీన్‌ నికోలస్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌ జవహర్‌ బాలభవన్‌ సహాయ సంచాలకుడిగా పనిచేస్తున్న విజయసాగర్‌కు రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాశాఖాధికారిగా బాధ్యతలు అప్పగించారు. కరీంనగర్‌ ప్రభుత్వ డైట్‌ కళాశా ల అధ్యాపకుడు ఎస్‌.మొండయ్యను డీఈవో బాధ్యతల నుంచి రిలీవ్‌ చేశారు. కరీంనగర్‌ డీఈవో చైతన్య జైనీ సెలవులో ఉండడంతో ఆమె తిరిగి విధుల్లో చేరే వరకు విజయసాగర్‌ అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement