బీజేపీ జేబు సంస్థగా సీఈసీ | - | Sakshi
Sakshi News home page

బీజేపీ జేబు సంస్థగా సీఈసీ

Sep 29 2026 12:39 AM | Updated on Sep 29 2026 12:39 AM

● డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం

కరీంనగర్‌ కార్పొరేషన్‌: కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ అనుబంధ సంస్థగా మారిందని డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎంఎల్‌ఏ మేడిపల్లి సత్యం ధ్వజమెత్తారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. సీఈసీ వైఖరిని నిరసిస్తూ ఏఐసీసీ పిలుపులో భాగంగా సోమవారం నగరంలో కాంగ్రెస్‌ ఆందోళన చేపట్టింది. నగరంలోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించి.. కలెక్టరేట్‌ ముందు ధర్నా చేపట్టారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌, మోదీ, అమిత్‌షా దిష్టిబొమ్మలు దహనం చేశారు. పోలీసులకు, పార్టీ శ్రేణులకు నడుమ స్వల్ప పెనుగులాట చోటుచేసుకుంది. మోదీ సర్కార్‌ వచ్చాక సీబీఐ, ఈడీ, ఐటీ లాగే ఎలక్షన్‌ కమిషన్‌ను కూడా బీజేపీకి అనుబంధ సంస్థగా మార్చారన్నారు. టీపీసీసీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు, మానకొండూర్‌ ఎమ్మెల్యే, కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్‌, కరీంనగర్‌ అసెంబ్లీ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు, హుజూరాబాద్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి ప్రణవ్‌బాబు, ఏఎంసీ చైర్మన్‌ ఆకుల నర్సయ్య, అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ గడ్డం విలాస్‌రెడ్డి, అల్ఫోర్స్‌ నరేందర్‌రెడ్డి, సుడా మాజీ చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, పురుమల్ల శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌, ఆకారపు భాస్కర్‌రెడ్డి, ఉప్పల అంజనీప్రసాద్‌, రాచకొండ చక్రధర్‌రావు, నర్సాగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement