అదనపు కలెక్టర్లుగా అవకాశం ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

అదనపు కలెక్టర్లుగా అవకాశం ఇవ్వాలి

Sep 29 2026 12:33 AM | Updated on Sep 29 2026 12:33 AM

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లుగా తమకే అవకాశం ఇవ్వాలని జెడ్పీ సీఈవోలు, డీఆర్‌డీవోలు కోరారు. కామారెడ్డిలో సోమవారం ఉమ్మడి నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్‌ను పది జిల్లాల జెడ్పీ సీఈవోలు, డీఆర్‌డీవోలు కలిసి వినతిపత్రం అందించారు. పంచాయతీరాజ్‌ శాఖలో సీనియర్లుగా ఉన్న సీఈవోలు, డీఆర్‌డీవోలను కాదని, జూనియర్లుగా ఉన్న రెవెన్యూ శాఖ నుంచి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లుగా నియమించడం సరికాదన్నారు. స్థానిక సంస్థలపై పూర్తి అవగాహన ఉన్న తమకే అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న, భవిష్యత్తులో ఖాళీ అయ్యే స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ పోస్టులలో అర్హత కలిగిన జెడ్పీ సీఈవోలు, డీఆర్‌డీవోలను పదోన్నతి లేదా తగిన నియామక ప్రక్రియ ద్వారా నియమించాలని విన్నవించారు.

పంచాయతీరాజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి జెడ్పీ సీఈవోల వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement