జిల్లా దరఖాస్తులు హాజరు అర్హత శాతం
కరీంనగర్ 1,166 980 653 66.63
జగిత్యాల 578 486 334 68.72
పెద్దపల్లి 374 317 232 73.19
రాజన్న సిరిసిల్ల 372 314 235 74.84
మొత్తం 2,490 2,097 1,454 69.34
సాక్షి పెద్దపల్లి: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టీజీటెట్ ఇన్‌సర్వీస్ టీచర్స్–2026 ఫలితాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా అత్యధిక అర్హతశాతంతో ముందంజలో నిలిచింది. నాలుగు జిల్లాల పరిధిలో మొత్తం 2,490 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 2,097 మంది పరీక్షకు హాజరయ్యారు. శనివారం వి డుదలైన ఫలితాల్లో 1,454 మంది అర్హత సాధించా రు. హాజరైన అభ్యర్థుల ప్రాతిపదికన మొత్తం అర్హతశాతం సుమారు 69.34 శాతంగా నమోదైంది.
సిరిసిల్ల టాప్.. కరీంనగర్ లాస్ట్
జిల్లాల వారీగా చూస్తే సిరిసిల్ల (74.84శాతం) మొదటి స్థానంలో ఉండగా, పెద్దపల్లి (73.19శాతం) రెండో స్థానంలో నిలిచింది. జగిత్యాల 68.72 శా తంతో మూడో స్థానంలో, కరీంనగర్ 66.63 శాతంతో నాలుగో స్థానంలో ఉన్నాయి. అత్యధిక దరఖాస్తులు, అత్యధిక హాజరు కరీంనగర్ నుంచే ఉన్నప్పటికీ, అర్హత శాతంలో మాత్రం వెనుకబడింది.


