సీఎం పర్యటనకు భద్రతా కవచం | - | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటనకు భద్రతా కవచం

Sep 29 2026 12:39 AM | Updated on Sep 29 2026 12:39 AM

సీఎం పర్యటనకు భద్రతా కవచం

కలెక్టరేట్‌, హెలిప్యాడ్‌ పరిసరాల్లో ఏర్పాట్ల పరిశీలన

కలెక్టర్‌, సీపీతో కలిసి సీఎం భద్రతా అధికారుల సమీక్ష

విధుల్లో నిర్లక్ష్యం చేస్తే వేటే: కలెక్టర్‌ చిత్రా మిశ్రా

కరీంనగర్‌ అర్బన్‌: ఈనెల 30న నూతన కలెక్టరేట్‌ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి రానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. సీఎం పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం, పోలీస్‌ శాఖ సమన్వయంతో ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో సీఎం భద్రతా అధికారులు సోమవారం కలెక్టర్‌ చిత్రా మిశ్రా, పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలంతో కలిసి నూతన కలెక్టరేట్‌ ప్రాంగణాన్ని పరిశీలించారు. కలెక్టరేట్‌ ప్రాంగణంలోని హెలిప్యాడ్‌, తెలంగాణ తల్లి విగ్రహం, నూతన కలెక్టరేట్‌ భవనం, సమావేశ మందిరం, కలెక్టర్‌ నూతన చాంబర్‌, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో భద్రత, ప్రొటోకాల్‌, ఇతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటనకు ముందు నిర్వహించే అడ్వాన్స్‌డ్‌ సెక్యూరిటీ లైజన్‌ సమీక్షలో భద్రతా ఏర్పాట్లు, బందోబస్తు, హెలిప్యాడ్‌, సీఎం కాన్వాయ్‌ వెళ్లే మార్గం, ట్రాఫిక్‌ నియంత్రణ, పార్కింగ్‌, అత్యవసర వైద్య సేవలు, అగ్నిమాపక ఏర్పాట్లు, ప్రొటోకాల్‌ తదితర అంశాలను సమీక్షించారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్‌ చిత్రా మిశ్రా మాట్లాడుతూ.. సీఎం పర్యటన నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు తమకు కేటాయించిన విధులను సమన్వయంతో నిర్వహించాలని ఆదేశించారు. నిర్దిష్ట సమయం లోగా ఏర్పాట్లను పూర్తిచేసి, ప్రతీ అంశాన్ని పరిశీలించి ధ్రువీకరించాలని సూచించారు. ఎలాంటి తప్పిదాలు, నిర్లక్ష్యానికి తావు లేకుండా అప్రమత్తంగా పని చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పటిష్ట బందోబస్తు

సీపీ గౌస్‌ ఆలం మాట్లాడుతూ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతీ దశలో పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు. సీఎం కాన్వాయ్‌, గౌరవ వందనం, భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. మున్సిపల్‌ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌, అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో షర్మిల, సీఎంవో ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ అధికారులు ఎస్పీ రామచందర్‌రావు, డీఎస్పీలు దుర్శేటి రఘుచందర్‌, శ్యాం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement