కరీంనగర్: క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించి సకాలంలో చికిత్స అందిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని హైదరాబాద్ మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ అంకాలజిస్టు డాక్టర్ అన్వేశ్, డాక్టర్ నీలేశ్, డాక్టర్ స్నేహ తెలిపారు. కరీంనగర్ మెడికవర్ ఆస్పత్రిలో గురువారం నిర్వహించిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరానికి 126 మంది హాజరై పరీక్షలు చేయించుకోగా, 16 మందికి పాజిటివ్‌గా గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. క్యాన్సర్ కేసుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతీ నెల రెండో గురువారం కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రిలో ఉచిత స్క్రీనింగ్ శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్‌లో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయనితెలి పారు. మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ సెంటర్ హెడ్ సంపత్, మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్, పీఆర్ అబ్దుల్ వకీల్ పాల్గొన్నారు.


