కరీంనగర్‌స్పోర్ట్స్: స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 షెడ్యూల్ విడుదలైంది. గురువారం కరీంనగర్ డీఐఈవో సత్యనారాంజనేయ, అండర్–19 ఎస్జీఎఫ్ కార్యదర్శి బన్సీలాల్ క్రీడా తేదీలను ప్రకటించారు. ఈ నెల 21 నుంచి అక్టోబర్ చివరి వరకు ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఈ ఎంపికల పోటీలు జరగనున్నాయి. అక్టోబర్ 31 వరకు 29 క్రీడాంశాల్లో ఈ సెలక్షన్స్ నిర్వహించనున్నారు. రాష్ట్రస్థాయి క్రీడల తేదీల్లో వచ్చే మార్పుల ఆధారంగా ఉమ్మడి జిల్లా ఎంపిక తేదీల్లోనూ మార్పులు ఉండే అవకాశం ఉందని ఎ్‌స్జీఎఫ్ కార్యదర్శి బన్సీలాల్ తెలిపారు. రాష్ట్రస్థాయికి ఎంపికై నవారు తల్లిదండ్రులు లేదా ప్రిన్సిపాల్ సమక్షంలో హామీపత్రాన్ని సమర్పించాలన్నారు. వివరాలకు 9652637637 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
క్రీడా పోటీలు.. తేదీలు ఇవే..
సెప్టెంబర్ 21,22 తేదీల్లో కరీంనగర్ రేకుర్తిలోని సాన్వీ కళాశాలలో బాలబాలికలకు కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. 23,24న రేకుర్తి ఢిల్లీ డిఫెన్స్ కాలేజీలో బాలబాలికలకు వాలీబాల్ పోటీలు ఉంటాయన్నారు. 25,26న నగరంలోని అంబేడ్కర్ స్టేడియంలో ఖోఖో పోటీలు నిర్వహిస్తారు. 27న ఢిల్లీ డిఫెన్స్ కాలేజీలో హ్యాండ్‌బాల్ పోటీలు, 28న జీనియర్ అకాడమీ కరీంనగర్‌లో చెస్ పోటీలు ఉంటాయన్నారు. 29న స్పోర్ట్స్ స్కూల్‌లో వుషు, రెజ్లింగ్, జిమ్నాస్టిక్ పోటీలు, 30న అంబేడ్కర్ స్టేడియంలో బాలురకు క్రికెట్ పోటీలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 1న అంబేడ్కర్ స్టేడియంలో బాలబాలికలకు బాస్కెట్‌బాల్, రగ్బీ, కరాటే, బాక్సింగ్, తైక్వాండో, తాంగ్‌తా పోటీలు నిర్వహిస్తారు. 2న జగిత్యాలలోని పొన్నాల గార్డెన్‌లో బాలబాలికలకు కురాషా, గట్కా, మల్లాకంబ్, ఫెన్సింగ్ పోటీలు, 3న ఇదే వేదికపై కలరిపయట్టు, వెయిట్‌లిఫ్టింగ్, స్కేటింగ్, సాఫ్ట్‌బాల్ పోటీలు నిర్వహించనున్నారు. 5న గోదావరిఖనిలోని జేఎన్ స్టేడియంలో బాలబాలికలకు బేస్‌బాల్, ఫుట్‌బాల్ పోటీలు ఉంటాయి. 6న తిమ్మాపూర్‌లోని శ్రీచైతన్య కాలేజీలో ఆర్చరీ పోటీలు, 7న అంబేడ్కర్ స్టేడియంలో బాలికలకు క్రికెట్ పోటీలు, బాలబాలికలకు యోగా పోటీలు నిర్వహిస్తారు. 8న స్టోర్ట్స్ స్కూల్ కరీంనగర్‌లో బాలికలకు అథ్లెటిక్ పోటీలు, బాలబాలికలకు స్విమ్మింగ్ పోటీలు ఉంటాయి. ఇక్కడే 9న బాలురకు అథ్లెటిక్ పోటీలు నిర్వహిస్తారు. 26న అంబేడ్కర్ స్టేడియంలో బాలబాలికలకు హాకీ పోటీలు, 28న కరీంనగర్ రేకుర్తిలోని ఎస్వీజేసీ మైదానంలో నెట్‌బాల్ పోటీలు, 30న అంబేడ్కర్ స్టేడియంలో సైక్లింగ్ పోటీలు నిర్వహిస్తారు. ఇదే రోజు నగరంలోని కేహెచ్‌ఆర్ అకాడమీలో బాలబాలికలకు టేబుల్ టెన్నీస్ పోటీలు ఉంటాయి. 31న అంబేడ్కర్ స్టేడియంలో బాలబాలికలకు బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తారు. టెన్నిస్, సాఫ్ట్ టెన్నిస్, స్క్వాష్, షూటింగ్, జూడో, సెపక్ తక్రా క్రీడల తేదీలు, వేదికలను త్వరలోనే ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు.
షెడ్యూల్ విడుదల చేసిన డీఐఈవో


