కొత్తపల్లి: తక్కువ స్థలంలో పుట్టగొడుగుల సాగు చేపట్టడం ద్వారా రైతులు అదనపు ఆదాయం, స్వయం ఉపాధి పొందవచ్చని డాక్టర్ ఎం. రాజేంద్రప్రసాద్ తెలిపారు. మండలంలోని చింతకుంట మన ఆదర్శ రైతు ఉత్పత్తి కంపెనీ లిమిటెడ్‌లో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో గురువారం రైతులు, మహిళలకు శ్రీఆరోగ్య పుట్టగొడుగులుశ్రీ సాగుపై ప్రాయోగిక శిక్షణ ఇచ్చారు. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై రైతులు దృష్టి సారించాలని ఎఫ్‌పీవో చైర్మన్ శంకరయ్య సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు, బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు వైష్ణవి, ఆస్నా, హంపీ, కార్తీక్, శిరీష, శివ పాల్గొన్నారు.


