కరీంనగర్‌స్పోర్ట్స్: కొత్తపల్లి అల్ఫోర్స్ ఈ టెక్నో పాఠశాలలో శుక్రజువారం నుంచి రెండు రోజుల పాటు జరుగనున్న 13వ రాష్ట్రస్థాయి యోగా స్పోర్ట్స్ చాంపియన్‌షిప్ ఏర్పాట్లను గురువారం అసోసియేషన్ చైర్మన్ రవీందర్‌సింగ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి సిద్ధారెడ్డిలు పరిశీలించారు. 25 జిల్లాల నుంచి 900 మంది బాల బాలికలు పాల్గొననున్నట్లు తెలిపారు. పోటీలను ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, మేడిపల్లి సత్యం, ఆల్ఫోర్స్ చైర్మన్ వి.నరేందర్‌రెడ్డి, రాష్ట్ర యోగా అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.ఎన్.రెడ్డి, ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు జాల మనోహర్‌లు ప్రారంభిస్తారని తెలిపారు.


