కరీంనగర్‌సిటీ: సైబర్ భద్రత, డిజిటల్ సాంకేతికతను బాధ్యతాయుతంగా వినియోగించాలని శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేశ్‌కుమార్ సూచించారు. శాతవాహన విశ్వవిద్యాలయం 100 రోజుల అకడమిక్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రాంలో భాగంగా, కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, సామాజిక శాస్త్రాల విభాగం, శాతవాహన యూనివర్సిటీ లా కాలేజ్ సహకారంతో శ్రీడిజిటల్ యుగంలో సైబర్ భద్రతశ్రీ అనే అంశంపై గురువారం వర్క్‌షాప్ నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ విద్యార్థుల్లో సైబర్ అవగాహనతో పాటు డిజిటల్ బాధ్యతను పెంపొందించాలని అధ్యాపకులకు సూచించారు. శాతవాహన విశ్వవిద్యాలయం న్యాయశాస్త్ర విభాగం రిసోర్స్ పర్సన్స్ ఫబ్హా అఫ్రీన్, ప్రియా రాఘవేంద్ర శ్రీసైబర్ నేరాలు– మహిళల భద్రతశ్రీ అనే అంశం గురించి వివరించారు. రిజిస్ట్రార్ పి.సతీశ్‌కుమార్, కాలేజ్ ఆఫ్ లా ప్రిన్సిపాల్ కె.పద్మావతి, ఆర్థిక శాస్త్ర విభాగాధిపతి అఫ్సరీ ఉస్మాని, బి.అనిల్ సింగ్ పాల్గొన్నారు.
ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడిగా మహమ్మద్ ఇమ్రాన్
కరీంనగర్ కార్పొరేషన్: ఎన్‌ఎస్ యూఐ జిల్లా అ ధ్యక్షుడిగా మహమ్మద్ ఇమ్రాన్ ని యామకం అ య్యాడు. రాష్ట్రంలోని 34 జిల్లాల కు అధ్యక్షులను నియమిస్తూ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. కరీంనగర్‌కు ఇమ్రాన్‌ను అధ్యక్షుడిగా నియమించారు. ఇమ్రాన్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. తన నియామకానికి సహకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణకు ఇమ్రాన్ కృతజ్ఞతలు తెలిపాడు.
కొత్తపల్లి: అక్రమ అరెస్టు అప్రజాస్వామికమని, తన అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, బీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు పొన్నం అనిల్‌కుమార్ గౌడ్ తెలిపారు. గురువారం తెల్లవారుజామున గృహనిర్బంధం చేసి, అనంతరం కొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారని అసహనం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులతో ప్రశ్నించే గొంతుకలను అడ్డుకోలేరని, కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
కరీంనగర్‌కార్పొరేషన్: ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద దళితులు నడిచిన రోడ్డును పాలు, పసుపు నీళ్లతో శుద్ధిచేసిన బీఆర్‌ఎస్ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొరివి అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఏసీపీకి ఫిర్యాదు చేశారు. దళితులు నడిస్తే రోడ్డు అపవిత్రమైందనడం బీఆర్‌ఎస్ కుల అహంకారానికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో ములకల మల్లేశం, సముద్రాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలి
కరీంనగర్: ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల (సైన్స్ వింగ్)లో అవగాహన, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులకు ఆత్మహత్యల నివారణ, మానసిక ఆరోగ్యంపై వ్యాసరచన పోటీ నిర్వహించి విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన సైకియాట్రిస్ట్, తెలంగాణ స్టేట్ ఐఎంఏ అధ్యక్షుడు పొరండ్ల కిషన్ మాట్లాడుతూ మానసిక సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దన్నారు. చైర్మన్ శ్రీనివాస్ శ్రీరాముల, కోచైర్మన్ రాజు, అధ్యక్షుడు శివకాంత్ పటేల్, కార్యదర్శి బట్టు వినోద్ పటేల్, కోశాధికారి మేతుకు కె.చైతన్య, జాయింట్ సెక్రటరీ ఐతా సూరజ్, కోలా అన్నారెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేస్తున్న లయన్స్‌క్లబ్ బాధ్యులు


