● ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక రైళ్ల తీరు ● పెద్దపల్లి, రామగుండంలో ఆపాలని డిమాండ్
రామగుండం: రద్దీ రూట్లలో ప్రత్యేక రైళ్లు నడిపి స్తున్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు.. వాటికి హాల్టి ంగ్ సౌకర్యం కల్పించకపోవడంపై ప్రయాణికులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రధానంగా బెంగళూరు – సికింద్రాబాద్ – నుంచి ఉత్తర భారత్ మధ్య నడిపే ప్రత్యేక రైళ్లకు కాజీపేటలోనే హాల్టింగ్ ఇచ్చారు. కానీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి, రామగుండంలో ఆపడంలేదు. పొరుగున ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్‌లో ప్రత్యేక రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం కల్పించడం తమపై వివక్ష చూపడమేనని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రయాణికులు మండిపడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్‌లో వంద కిలోమీటర్ల పరిధిలో ఒక్కహాల్టింగ్ ఇవ్వకపోగా, ఇరవై కిలోమీటర్ల దూరం కూడా లేకపోయినా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మూడు రైల్వేస్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సరుకు రవాణా ద్వారా సికింద్రాబాద్ డివిజనకు వచ్చే ఆదాయంలో 70శాతం రామగుండం, పెద్దపల్లి నుంచే ఉంటోంది.
ఆదాయ వివరాలు ఇలా..
● రామగుండం రైల్వేస్టేషన్‌ను ‘ఏ’ కేటగిరీలోని నాన్ సబర్బన్ గ్రేడ్ (ఎన్‌ఎస్‌జీ–4) కింద చేర్చారు. ప్రతీరోజు 97 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 18వేల మంది గమ్యస్థానాలు చేరుకున్నారు. టికెట్ల ద్వారా రైల్వేకు గరిష్టంగా రూ.45 కోట్ల ఆదాయం సమకూరినట్లు అంచనా. ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్, సింగరేణి తదితర పరిశ్రమల నుంచి సరుకు రవాణా ద్వారా రూ.వందల కోట్లు సమకూరింది.
● పెద్దపల్లి రైల్వేస్టేషన్ నాన్ సబర్బన్ గ్రేడ్–5 కేటగిరీలో ఉంది. ప్రతీరోజు సుమారు 60 రైళ్లలో 8వేల మందికిపైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వేశారు. గత ఆర్థిక సంవత్సరంలో టికెట్ల రూపంలో రూ.10 కోట్ల ఆదాయం ఆర్జించినట్లు అంచనా.


