ఖతార్‌లో ఉద్యోగావకాశాలు | - | Sakshi
Sakshi News home page

ఖతార్‌లో ఉద్యోగావకాశాలు

Sep 9 2026 11:51 PM | Updated on Sep 9 2026 11:51 PM

● ఈనెల 17 నుంచి ఫ్రీ ఇంటర్వ్యూలు

ఇంటర్వ్యూ తేదీలు.. వేదికలు

● ఈనెల 17 నుంచి ఫ్రీ ఇంటర్వ్యూలు

వేములవాడ: ఖతార్‌లో వివిధ ఉద్యోగాల భర్తీకి జీటీఎం ఇంటర్నేషనల్‌ సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న ఆ సంస్థ ప్రతినిధి చీటి సతీష్‌రావు తెలిపారు. బాగేజ్‌ హ్యాండ్లర్లు, క్లీనర్లు, వెయిట్రెస్‌లు, సౌస్‌చెఫ్‌లు, కుక్‌లు, క్యాటరింగ్‌ సూపర్‌వైజర్ల పోస్టులను భర్తీ చేయనున్నట్లు వివరించారు. బాగేజ్‌ హ్యాండ్లర్‌, క్లీనర్‌ పోస్టులకు ఖతార్‌ 1,000 రియాల్స్‌ బేసిక్‌ వేతనం ఉండగా, సౌస్‌ చెఫ్‌కు 5వేల రియాల్స్‌, సీనియర్‌ సీడీపీకి 4వేల రియాల్స్‌, చీఫ్‌ స్టీవర్డ్‌కు 3,500 రియాల్స్‌ వరకు వేతనం ఉంటుందని వివరించారు. ఇతర పోస్టులకూ పోస్టును బట్టి 1,600 నుంచి 3,200 రియాల్స్‌ వరకు గ్రాస్‌ వేతనం ఉంటుందని పేర్కొన్నారు. ఉచిత భోజనం, వసతి, రవాణాతోపాటు వీసా, టికెట్‌, వైద్య సదుపాయాలను సంస్థ కల్పిస్తుందని వెల్లడించారు. వివరాలకు సికింద్రాబాద్‌ 83320 52299, నిజామాబాద్‌ 86868 60999, ఆర్మూర్‌ 83320 13999, జగిత్యాల 83320 42299, సిరిసిల్ల 93476 61522, ఆఫీస్‌ 040–42029999 నంబర్లపై సంప్రదించవచ్చని తెలిపారు.

సెప్టెంబర్‌ 17 : సికింద్రాబాద్‌ – జీటీఎం

ఇంటర్నేషనల్‌ కార్యాలయం

సెప్టెంబర్‌ 18: సిరిసిల్ల, జగిత్యాల– క్లీనర్‌ (బాగేజ్‌ హ్యాండ్లర్‌ పోస్టులు)

సెప్టెంబర్‌ 19: నిజామాబాద్‌, ఆర్మూర్‌

(క్లీనర్‌, బాగేజ్‌ హ్యాండ్లర్‌ పోస్టులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement