విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి

Aug 30 2026 12:03 AM | Updated on Aug 30 2026 12:03 AM

కరీంనగర్‌స్పోర్ట్స్‌: విద్యార్థులు చదువుకే పరి మితం కాకుండా క్రీడల్లోనూ రాణించాలని అదనపు కలెక్టర్‌ డి.శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. జా తీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో ప్రాంతీయ క్రీడా పాఠశాలలో శనివారం వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా శ్రీనివాస్‌రెడ్డి హాజరై హాకీ దిగ్గజం ధ్యాన్‌ చంద్‌ చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసానికి దోహదపడతాయన్నారు. విద్యార్థులు ధ్యాన్‌చంద్‌ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. జూడో, జిమ్నాస్టిక్స్‌, యోగా, అథ్లెటిక్స్‌ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. డీవైఎస్‌వో వి.శ్రీనివాస్‌గౌడ్‌, మై యువభారత్‌ యువజన అధికారి గోళి తిరుపతిరెడ్డి, జిల్లా మహిళా సాధికారత కోఆర్డినేటర్‌ సరస్వతి, ఒలింపిక్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనా ర్ధన్‌రెడ్డి, జాతీయ యువజన అవార్డు గ్రహీత ఏ.కిరణ్‌ కుమార్‌, రాష్ట్ర అవార్డు గ్రహీత స త్తినేని శ్రీనివాస్‌, మేనేజర్‌ రమేశ్‌ పాల్గొన్నారు.

ఇంగ్లిష్‌లో బోధించాలి

కరీంనగర్‌రూరల్‌: పీఎంశ్రీ పాఠశాలల్లో విద్యార్థులకు తప్పనిసరిగా ఇంగ్లిష్‌లోనే విద్యాబోధన చేయాలని డీజీఈ(డైరెక్టర్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎగ్జామినేషన్స్‌) లింగయ్య ఉపాధ్యాయులకు సూచించారు. శనివారం దుర్శేడ్‌ పీఎంశ్రీ జెడ్పీ పాఠశాలను ఆకస్మికంగా తనీఖీ చేశారు. పీఎం శ్రీ పథకం నిధుల మంజూరు, ఖర్చు చేసిన పనులు, రికార్డులను పరిశీలించా రు. లైబ్రరీ, మరుగుదొడ్లు, ల్యాబ్‌ను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. ఉపాధ్యాయులతో సమావేశమై తప్పనిసరిగా ఇంగ్లిష్‌ మీడియంలోనే బోధించాలని సూచించారు. జిల్లా ఓపెన్‌స్కూల్‌ కోఆర్డినేటర్‌ రవీందర్‌, ఏఎస్‌వో రాజేందర్‌, ఎంఈవో వాసవి, ప్రధానోపాధ్యాయుడు రత్నాకర్‌ పాల్గొన్నారు.

అంగన్‌వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్‌

కొత్తపల్లి(కరీంనగర్‌): అంగన్‌వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్‌ సౌకర్యం కల్పించేందుకు టీజీఎన్పీడీసీఎల్‌ చర్యలు చేపట్టింది. సర్కిల్‌ పరిధిలోని 379 కేంద్రాలకు ఉచితంగా కనెక్షన్లు అందిస్తామని ఎస్‌ఈ రవీందర్‌ తెలిపారు. విద్యుత్‌ కనెక్షన్లు ఏర్పాటు చేయడం ద్వారా ఫ్యాన్లు, లైట్లు, తాగునీటి మోటార్లు, ఇతర విద్యుత్‌ పరికరాలు సక్రమంగా వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి కేంద్రం విద్యుత్‌ వెలుగులతో కళకళలాడేలా అవసరమైన చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.

డంప్‌యార్డ్‌ తరలించాలి

కరీంనగర్‌ కార్పొరేషన్‌: డంప్‌యార్డ్‌ను నగరానికి దూరంగా తరలించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. శనివారం నగరపాలకసంస్థ కార్యాలయానికి ర్యాలీగా వచ్చి, ప్రధాన ద్వారం వద్ద ధర్నా నిర్వహించారు. నగరపాలకసంస్థ సర్వసభ్య సమావేశం జరుగుతున్నందున ఆందోళన చేస్తున్న టీఆర్‌ఎస్‌ నాయకులను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా గుంజపడుగు హరిప్రసాద్‌ మాట్లాడుతూ నగరంలో ప్రతిరోజూ 160 మెట్రిక్‌ టన్నుల చెత్త వచ్చి చేరుతోందని, ఇప్పటికే 4.5 లక్షల మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలు డంప్‌యార్డ్‌లో పేరుకుపోయాయన్నారు. దీంతో దుర్వాసన, పొగ, దోమలతో ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బయో మైనింగ్‌ పేరుతో రూ. 25 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయిందని, శాసీ్త్రయ వ్యర్థాల నిర్వహణలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ విఫలమైందని ఆరోపించారు. లింగంపల్లి నాగరాజు, మేకల తిరుపతి, చెన్నమల్ల చైతన్య, శ్రీరాముల రమేశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement