లైబ్రరీ.. ఖాళీల వర్రీ | - | Sakshi
Sakshi News home page

లైబ్రరీ.. ఖాళీల వర్రీ

Aug 30 2026 12:03 AM | Updated on Aug 30 2026 12:03 AM

గ్రంథాలయాల్లో లైబ్రేరియన్‌ పోస్టులు ఖాళీ

మూడు దశాబ్దాలుగా నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూపు

నిరీక్షిస్తున్న వేల మంది అభ్యర్థులు

కరీంనగర్‌కల్చరల్‌: కానిస్టేబుల్‌ కావాలన్నా.. ఎస్సై కావాలన్నా.. గ్రూప్‌–2, గ్రూప్‌–3 కొట్టాలన్నా.. ఇంజినీర్‌గా కొలువు సాధించాలన్నా.. వేలాది మంది నిరుద్యోగులకు గ్రంథాలయాలే కోవెలగా నిలుస్తున్నాయి. అక్కడి పుస్తకాలు చదివి ప్రభుత్వ ఉద్యోగా లు సాధిస్తున్నారు. కానీ.. ఆ విజ్ఞాన కేంద్రాలను శాసీ్త్రయంగా నిర్వహించేందుకు లైబ్రరీ సైన్స్‌ చదివిన అభ్యర్థుల జీవితాల్లో మూడు దశాబ్దాలుగా చీకట్లే ముసురుకున్నాయి. 1986లో చివరిసారిగా లైబ్రేరియన్‌ పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం.. ఆ తర్వాత నియామక ప్రకటన విడుదల చేయకపోవడంతో వేలాది మంది ఎదురుచూస్తున్నారు. ‘మా పుస్తకాలతో చదివి ఇతరులు ఉద్యోగాలు సాధిస్తున్నారు.. మేం చదివింది మాత్రం ఎప్పుడు పని కొస్తుంది?’ అంటూ లైబ్రరీ సైన్స్‌ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చదివిన వారికే కొలువు లేదు

లైబ్రరీ సైన్స్‌ కోర్సులు పూర్తి చేసి, ప్రభుత్వ ఉద్యో గం వస్తుందన్న ఆశతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఒకవైపు ప్రభుత్వ గ్రంథాలయాలకు పాఠకుల సంఖ్య పెరుగుతోంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు గ్రంథాలయాల అవసరం తప్పనిసరిగా మారుతోంది. అయినా.. ఆ గ్రంథాలయాల్లో పనిచేయాల్సిన సిబ్బంది నియామకాల విషయంలో ఆశించిన స్థాయిలో కదలిక కనిపించడం లేదు.

లైబ్రేరియన్‌ అంటే..

లైబ్రేరియన్‌ అంటే పుస్తకాలు ఇచ్చి.. తిరిగి తీసుకునే ఉద్యోగి మాత్రమే కాదు. పాఠకుడి అవసరాన్ని గుర్తించి సరైన పుస్తకాన్ని అందించడం నుంచి పోటీ పరీక్షలకు అవసరమైన సమాచారం ఇవ్వడం వరకు కీలక పాత్ర పోషిస్తారు. కొత్తగా వచ్చిన పుస్తకాలు, పత్రికలు, మ్యాగజైన్లను కేటలాగ్‌ చేయడం.. పుస్తకాలను క్రమబద్ధీకరించడం.. పాఠకులకు అవసరమైన సమాచారాన్ని అందించడం.. గ్రంథాలయాల ను పర్యవేక్షించడం లైబ్రేరియన్‌ బాధ్యతల్లో భాగం. ముఖ్యంగా గ్రూప్‌ పరీక్షలు, పోలీస్‌ ఉద్యోగాలు, బ్యాంకింగ్‌, ఉపాధ్యాయ నియామకాలు, ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకు లైబ్రేరియన్‌ ఒక మార్గదర్శిగా ఉంటారు. పుస్తకాల మధ్య ఉండే విజ్ఞానాన్ని పాఠకుడికి చేరవేసే కీలకమైన వారే లైబ్రేరియన్లు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement