కేసుల పేరిట భయపెడుతున్న కవ్వంపల్లి | - | Sakshi
Sakshi News home page

కేసుల పేరిట భయపెడుతున్న కవ్వంపల్లి

Aug 30 2026 12:03 AM | Updated on Aug 30 2026 12:03 AM

● మానకొండూర్‌ మాజీ ఎమ్మెల్యే రసమయి మండిపాటు

తిమ్మాపూర్‌: మానకొండూర్‌ నియోజకవర్గంలో అసత్యాలు, అగౌరవ సంఘటనలతో అసమర్థ పాలన సాగుతోందని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌న్‌ మండిపడ్డారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని, ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి భయపెడుతున్నారని ఆరోపించారు. తిమ్మాపూర్‌లోని బీఆర్‌ఎస్‌ నాయకుడు కేతిరెడ్డి దేవేందర్‌ రెడ్డి అతిథి గృహంలో శనివారం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మానకొండూర్‌లో ఎమ్మెల్యేను ప్రశ్నించే ప్రతి ఒక్కరిపై కేసులు పెడుతున్నారని విమర్శించారు. గన్నేరువరం యువకులు రోడ్డు వేయాలని అడిగినందుకు కేసులు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. మూడేళ్లు గడిచినా రోడ్డు పనులు జరగలేదని, కాంట్రాక్టర్‌ రూ.5 కోట్లు ఇస్తే రోడ్డు వేస్తానని చెబుతున్నాడని వెల్లడించారు. గాలిపల్లికి చెందిన బద్దం ఎల్లారెడ్డి ఇంటికి రాత్రి పోలీసులను పంపి బెదిరించాడని ఆరోపించారు. తమపై తప్పు డు పోస్టులు పెడుతున్నవారిపై సీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు రావుల రమేశ్‌, పొన్నం అనిల్‌, ఎలుక ఆంజనేయులు, తాట్ల తిరుపతి, శ్రీనివాస్‌, అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement