రాఖీ పండుగ ముగిసింది. శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు శనివారం తిరుగు పయనమయ్యారు. దీంతో కరీంనగర్ బస్టాండ్‌లో ఇసుకేస్తే రాలనంత రద్దీ నెలకొంది.
ఆర్టీసీ స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ బస్సులు సరిపడక ఇబ్బందులు తప్పలేదు. హైదరాబాద్, గోదావరిఖని, నిజామాబాద్, వరంగల్ రూట్లతో పాటు గ్రామీణ ప్రాంతాలకు
వెళ్లేందుకు బస్సులు దొరక్క తిప్పలు పడ్డారు. వచ్చిన బస్సుల్లో సీట్ల కోసం కుస్తీకి దిగారు. చాలా మంది మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు బస్సుల కోసం నిరీక్షించడం కనిపించింది.
ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్


