గగన వీధి.. గెలిచి తీరి..! | - | Sakshi
Sakshi News home page

గగన వీధి.. గెలిచి తీరి..!

Aug 23 2026 1:34 AM | Updated on Aug 23 2026 1:34 AM

రాకెట్‌లా దూసుకెళ్తున్నారు

రాకెట్‌లా దూసుకెళ్తున్నారు

కోల్‌సిటీ(రామగుండం): సింగరేణి కార్మికుడి కూతురును పట్టుదల.. తల్లిదండ్రుల ప్రోత్సాహం ప్రతిష్టాత్మక భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో శాస్త్రవేత్తగా నిలబెట్టాయి. గోదావరిఖని జహార్‌నగర్‌లో నివాసం ఉంటున్న పెంచల వెంకటస్వామి, రమాదేవి దంపతులకు ప్రియ మాధురి, ప్రీతి ఇద్దరు కూతుర్లు. వెంకటస్వామి సింగరేణి సంస్థ 2 ఇంక్లయిన్‌ బొగ్గు గని సర్వే విభాగంలో పని చేస్తున్నాడు. ప్రియ మాధురి దేశ అంతరిక్ష రంగంలో పనిచేయాలనే ఉద్దేశంతో తిరువనంతపురంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ)లో రాకెట్‌ సైన్స్‌ నేర్చుకున్నారు. ఫిజికల్‌ సైన్స్‌లో బీటెక్‌ పూర్తి చేశారు. 2017లో ఇస్రోలో శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌ బాల్‌నగర్‌లోని ‘నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ)’లో విధులు నిర్వహిస్తున్నారు. ఉపగ్రహాల ద్వారా సేకరించే సమాచారాన్ని ఉపయోగించి పట్టణ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితుల అంశాలను అధ్యయనం చేసే పరిశోధనల్లో భాగస్వామ్యం అవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement